Saturday, December 01, 2007

శ్రీ వేంకటేశ్వర దర్శనము

నమోశ్రీనివాసా! నమొ నమో శ్రీనివాసా!
నమో వేంకటేశా! నమొ నమో వేంకటేశా!!
శిఖను మెరిసిన నవరత్నఖచిత మకుట వెల్గులు
సాంద్ర నీల జీమూతన మెఱుపుబోలు!
సొగసు కనుబొమల కలుపు
నొసట నామంబు తెలుపు!
సోగకన్నుల సగము కప్పినొప్పు
చూడ నడుమ కస్తూరి తిలకంబు సొంపు! నమోశ్రీనివాసా
సొగపు సంపెంగ నాసికాగ్రము
చెక్కిళ్ళటద్దాల వెల్గెటి ముకుందము!
సుధలు చిందెటి అధరంబున
నెలవంక తొంగిచూసిన ముత్యాల దంతపంక్తి!
సొంపైన చుబుకంబుతెలుపు
భక్తిరక్తికి పొందిన లాంఛనంబు నమోశ్రీనివాస
మెడపైన మణిహారములు దీప్తిలెసగ
ఓహో మేలైన మేని నలుపు!
ఇంపైన శంఖ చక్రంబులు
కుడి ఎడమ భుజముల బలుపు!
అగ్ని సాక్షిగ వక్షంబు నిలయ "లచ్చి"
ఆహా! హ్రుదిలోని వలపు సాక్షి! నమోశ్రీనివాస
పచ్చల కెంపులద్దిన పతకంబు
యురముపై కాంతులీనుచునుండ
విమల యజ్ఞోపవీతంబు "వేది"యై
వామభుజముమీదుగ నాభిచేరె నమోశ్రీనివాస
మణిబంధ రత్న కడియములు మెరయు
తరణి మెరసిన క్రణంబు కరణి!
ధర్మదండము దక్షిణహస్తంబవధరించి
ధరణినేలుట నాదె ధర్మమనుచు!! నమోశ్రీనివాస
పట్టుశ్వేతాంబరపు పచ్చంచు కుచ్చులు
కటిసూత్రముగ చుట్టి
చరణకంకణంబుల చుంబించుచుండె!!
పసిడికాసుల పేరులు వడ్డికాసుల సిరులు
పైనుండి క్రిందికి జీరాడుచుండె
పుష్పాల చేరులు తరుల ముడుపుల విరులు
మృదుల పాదల తాకుచుండె! నమోశ్రీనివాస
పున్నాగ సంపెంగ పూదండ
మకరకుండల మండలంబును చుట్టి
ఇరువైపు శంఖచక్రాలమీదుగ భువినిచేరె!
వజ్ర వైఢూర్య శోభిత వరదహస్తంబు
చూపునదె దివ్యచరణారవిందసీమ!! నమోశ్రీనివాస
వేయివెల్గుల రేడు శ్రీవేంకటెశ్వరుడు!
వెల్గుచున్నాడు నేడు వేంకటరమణుండు నమోశ్రీనివాస

ఫలశృతిః
అందములుచిందు ఆర్తజనరక్షకుండు
ఆనందవందారువు స్వామి! సర్వాంగ సుందరాంగుడు
అవని వందితుండు వాడె! సుధాతరంగ రంగడు!
ఇట్టి వేంకటెశ్వరు దర్శించు నిత్యము
ఇలలోన ఏవ్వరేని రేయిబగలు
అట్టివారికి నెల్లసకల సౌభాగ్యములుకూడి
నిశ్చల జ్ఞానంబు కల్గు నిశ్చయంబుగ!!!

"సర్వేజనాః సుఖినో భవంతు" -
శుభంభూయత్!

Written by -
Prasad Komarraju

Composed by -
Rao Pamganamamula

Monday, August 20, 2007

Everest of Americas

If you are considering going on a vacation of your lifetime to a mountain much like the Himalayas you should consider the Pacific Northwest before anything else. The scenic valleys, mountains, volcanoes, and bodies of water are spectacular. And above all there is Mount Rainier one of the most scenic mountains or volcanoes worldwide. Here are some interesting facts about Mount Rainier or the "tower over Seattle" which you might find interesting. Consider a definite visit because this might be as close to Everest as you can possibly get...



Mount Rainier looms over Seattle and Tacoma
At 14,400 feet it is the tallest mountain in the continental U.S. - Wikipedia


Facts about Mount Rainier

With 26 major glaciers, Mount Rainier is the most heavily glaciated peak in the lower 48 states with 35 square miles (91 km²) of permanent snowfields and glaciers. The summit is topped by two volcanic craters , each over 1,000 feet (300 m) in diameter with the larger east crater overlapping the west crater. Geothermal heat from the volcano keeps areas of both crater rims free of snow and ice, and has formed an extensive network of glacier caves within the ice-filled craters. A small crater lake, the highest in North America, occupies the lowest portion of the west crater below more than 160 feet (50 m) of ice and is accessible only via the caves.

Mount Rainier was originally known as Talol, or Tahoma, from the Lushootseed word ("mother of waters") spoken by the Puyallup. It has a topographic prominence of 13,210 feet (4,026 m), greater than that of K2. It is a prominent feature of the southern landscape in most of the Seattle metropolitan area. On clear days, it can also be seen from as far away as Portland, Oregon, and Victoria, British Columbia. Because of its scenic dominance, Seattle- Tacoma-area residents often refer to it simply as "the Mountain." [1] The effects of Mount Rainier when it erupts can be felt for 300 miles around it, sending ash all the way to Vancouver, B.C, Canada.

FYI :
K2 is the second-highest mountain on Earth.

Our trip to Mount Rainier was an unexpected one. It was a 3 hour drive from Seattle and a six hour drive from Vancouver. We were all tired and restless (including me) this meant that many of us did not want to go. But nanna, amma, thatayya persisted on going and so we decided to take the chance even though it meant three more hours of travel time.
As you can see our luck was incredible, it turned out to be a clear blue evening when we arrived and that meant that this was one of the fifty days that it would be visible.
We drove up to about 10,000 ft above sea level which is where Paradise Point is. It is where you can see Mt. Rainier the closest.
The last time we went was in 2003 when it was cloudy and Mt Rainier did not reveal its majestic peak until we were a little far away. I think we were lucky to see it because it only appears about 50 days a year and of course we were on a tight schedule. Thatayya and Atha had to leave the next morning at about 8:00 A.M so going there and coming back is a bit tough especially since we arrived close to sunset when it is freezing at about 30 degrees Fahrenheit at Paradise Point. And the temperatures will plummet into to the single digits when the sun has set. As you can see we were all freezing with our light jackets (Seattle weather is actually pleaseant year round except on mountains). And so there was only time enough for a few pictures. The way back was also tough because of the dense foliage of the forest. The trees loomed so high that they blocked the light of the stars, moon, and setting sun. There were no lights on the road except for the headlights. An overall great experience for everyone even Mavayya and Thathayya who drove through the darkness. Overall we made it back safely and above all the experience was spectacular!


This is only my first blog so I convey my apologies for any of my errors (including grammar).




































H

Friday, July 06, 2007

కొన్ని తవికలు

రెమినిసింగ్ (Reminiscing)
జ్ఞాపకమనే మూడో నేత్రంతో
గతమనే గనిని వెతికి చూస్తే
చివరకు దొరికింది తీయని అసంతృప్తి

ఇన్సామ్నియాక్ (Insomniac)
నిద్రాదేవి అందని తావి
తప్పిన గురి - నా జీవన ఝురి

ద్వంద్వం 2
ఇవి ఆలోచనలు
వీటికి హద్దులే లేవు
నిరంతరం ఆకాశమార్గానే వీటి పయనం
ఆశయాలు, ఆశ్లేషాలు, ఆవేశాలు
వీటిని విహరింపచేసే రెక్కల గుర్రాలు
అవి చేసే పనులు
వాటికి ఉన్నవే హద్దులు
యదార్ధపు ఊబిలో వాటి నివాసం
సందిగ్ధాలు, సందేహాలు, సంక్లిష్టాలు
వాటిని పీడించే దోమలు, జలగలు, మొసళ్ళు..

మా పాపాయి

మా పాపాయి

ముద్దులొలికే పాప మురిపాల పాప
మా పాప సాటి మహిలోన లేదు!!

తాతయ్య చేతినొకచేత పట్టి
నానమ్మ కోకనొకవేలు చుట్టి!
అడుగులో అడుగు వేసుకొని నడిచి
అందమైన లోకాల చుట్టిచుట్టి...
|| ముద్దులొలికే పాప ||
ఆటలకే కాని, పాటలేకాని
ఆర్ష విద్యలందైన కాని అన్నింట ముందుండ
అమ్మ సీతమ్మ ఆశీస్సులే నీకుండ
అరుదైన బిరుదులన్నీ మా పాపాయి సొత్తు
|| ముద్దులొలికే పాప ||
మాధుర్యమైన మాటలే పలుకుచుండు
మంచి చెడులనుయందు హంసిగానుండు
ఎంత ఎదిగినకాని ఒద్దికగ ఒదిగుండు పాప
|| ముద్దులొలికే పాప ||
అమ్మ పొత్తిళ్ళలో కేరింత
అజితాన్వితకిదె జయము! జయము!!
ఆటపాటల అజేయపరాక్రమానమందాన్వితకిదే జయము! జయము!!
|| ముద్దులొలికే పాప ||

చి|| అన్వితకు బారసాల సందర్భంగా,
బామ్మ - తాతయ్య
పిన్ని - బాబాయి
అమ్మ - నాన్న

Written by Prasad Komarraju

Wednesday, June 13, 2007

Suprabhata Seva

You can now listen to Suprabhata Seva, a loose translation (svEchAnuvAdam) of Sanskrit based Sri Venkateswara Suprabhatam into Telugu. This was written and sung by Prasad Komarraju.

Monday, June 11, 2007

A few audiobooks

Hello folks,

I have posted a few new articles on my blog. Now, before all of you start thinking me as a selfish guy that doesn't post to the common blog of our community (manamantha), I just want to let you know that I will be more active in manamantha from now on as well, and will definitely try to post stuff that's of interest to all of you..

Thanks :)

Wednesday, June 06, 2007

Have you googled 'google maps' lately?

Google has been adding new satelite images to their database. For example, Google Maps shows Gudivada, Andhra Pradesh in detail where we lived for 3 years. I could identify lots of things. Mean while, Google Earth updated Khammam, Andhra Pradesh where our parents have a house. It's simply breath taking. We used to have arguments about the distance between certain places in Khammam. Now, for the record, I can tell that distance between from my grandmother's house (where she used to live) to Saint Joseph high school is 1.36 miles.

Sunday, April 08, 2007

సుప్రభాత సేవ

శ్రీ కృష్ణపరభ్రహ్మణే నమ:
సుప్రభాత సేవ

ఫ్రసాద్ కొమ్మర్రాజు


1.
కౌసల్యా సుత దాశరధిరామా
కౌస్తుభాభరణ జానకిరమణా
కొండల కోనల తూరుపు దిక్కున
సూర్యోదయ సమయంబాయె!!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

2.
నీవెలుగున వెలిగే సూర్యచంద్రులు
నీబలమున వేచే వాయుదెవులు
నీకనుసైగలతిరిగే దిక్పాలకలు
నీఅనుమతికైవేచిన వేలుపులు

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

3.
క్షీరాబ్ధియందు పవళించి విహరించు శ్రీహరి!
క్షిరసాగర తరంగ చిణ్కులు రవలించువెళ
క్షిరాబ్ధి కన్యకను కూడి క్రీడించు వేడ్క ముగిసె
క్రిరసాగర తరించె లెమ్ము! మమ్ము పాలించువేగ!!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

4.
శ్రీచక్రపురమున శయనించు చిన్మయమూర్తి!
శ్రీదెవీపరిష్వంగానంద డొలికనుండీ
శ్రీనివాసా! మెల్లమెల్లగా నీకలువకన్నులు
పద్మదళప్రపుల్లమై ప్రత్యూష దర్శన మీయవా!!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!


5.
వెలుగు చిందెటి సూర్యకిరణాలు దిక్కులు
వెల్లి విరయ కమంబులువిరిసెనయా!
విహంగములు నింగికినెగిరి కీర్తించెనయా
విష్నుభక్తులు వాకిటజేరి భజనలు చెసిరయా!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

6.

శుకములు పికములు
చక చక పలికే వేదములు
ఝుం ఝుం అంటూ తుమ్మెదగుంపులు
చెసే తుంబురు నాదంబులు!!

జలజల పారే నదీనదములు
నీరద నారద సంగీతములు
మలయ మారుతములు విసిరే వింజామరులే!
సప్తగిరుల తరులు విరిసి వెలసిన రంగవల్లులే !!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

7.
రంభా ఊర్వసి దివిజేంద్రుని
నాట్యభమలూ భువిలో మయుర నాగిని
నాట్యముచెయగ వేంచేశారే వేంకటాద్రిని

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

8.
సరసిజనాభుని పదముల జేరగ
సరసున విరిసిన కమలములు
సుందర వనమున మన్మధ కరమున పెరిగిన
సుమనోహర మల్లెలు జాజులు
స్వామీ! నీకంటహరమున చేరగ కోరుచున్నవే!!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

9.
అందుతున్నదేదొ జన్మలపున్యం
అద్దుతున్నదేదోమరేదోజన్మల పాపం
అది యిది యేమొకానీ నీ దర్సనభాగ్యమె
అమితానందం అవనిలోనమాకు!
వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!!స్వామీ! సుప్రభాతసమయం సమయంబిదియే!

Thursday, March 22, 2007

Cricket Mania Minus Ads

I don't know about the rest of you guys, but for me watching world cup without the agreeably annoying ads is not the same. Even though the ads were played repeatedly, they were part of my ‘world cup’ watching experience. Ads like ‘MRF-Zima’, and ‘CEAT’ come to my mind.

In US, watching cricket via satellite has taken away that experience. I went through this last two world cups as well, it’s not new. However, this time we have ‘youtube’ to rescue us. I don’t want to provide all the links here. But, I like the ‘nike’ one, and planning to watch others as well. Let me know what’s your ‘youtube’ world cup ad is.

p.s. This 'TATA Sky' ad tells me that guys/gals in India can watch cricket in multiple angles. Any reviews?

Friday, March 09, 2007

సౌందర్య

సౌందర్య


- విరించిప్రియ


రోజులాగా మా నాన్నగారు ఆఫీసు నుంచి రాగానే స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి దణ్ణం పెట్టుకున్నారు. మేపిల్లలం ఏం మాట్లాడాలన్నా ఆఅయన మంచి మూడ్ కోసం ఎదురు చూస్తూంటాం. మా నాన్నగారి మూడ్ ఆరోజు బాగానే ఉందని ఆయన చిరునవ్వుతో మమ్మల్ని చూస్తూ పూజాగదిలోకి వెళ్ళినప్పుడే మా కర్థం అయి పోయింది. కానీ మాకు అర్థం కాని విషయం బాబా ఫోటోదగ్గర ఉన్న ఎన్ వలోప్ లో ఏముందో అని. మామూలుగాయితే నాన్నగారు జీతం డబ్బులు ఇంక్రిమెంట్లు బాబా ఫోటో దగ్గర పెడ్తూంటారు. కానీ అవి నెలాఖరు రోజులు కూడా కావు. ఆరోజు జూన్ 15 స్కూళ్ళు మొదలయ్యి రెండు రొజులే అయ్యింది. అది ఏమిటో దేవుడి గది దగ్గర వరుసగా నిలుచొని ఉన్న మా నలుగురికి ఒక పజిల్ లాగా ఉంది. మా అందరికి తెలుసు మా నాన్నగారు ఏ విషయమూ డైరెక్టుగా మా తో చర్చించరు. బహుశా 20 ఏళ్ళుగా ఆ పోలీసు ఉద్యోగంలో ఉండబట్టేనేమో ఆయన ఎప్పుడూ చాలా గంభీరంగా ఉంటారు. కొత్త వాళ్ళకయితే, మరీ ప లకరించాలంటేనే బెదురు పుడ్తుంది. కాని మేమంటే ఆయనకి చాలా ప్రేమ.ఇక భోజనాలకి కూర్చున్నాము. మా నాన్న గారు నన్ను పిలిచి ఆ కవరు తీసుకొచ్చి అందులో ఏముందో చదవమన్నారు.మా అన్నయ్యలిద్దరూ,మాచెల్లెలూ ఆ అవకాశము వాళ్ళకి రానందుకు నన్ను కొరకొర చూస్తున్నారు. నేను ఒక్క గెంతుఫేసి పరిగెత్తుకెళ్ళి ఆ కవరు తెచ్చి ఒపెన్ చేసి చదవడం మొదలు పె ట్టాను. అవి మా నాన్నగరి ట్రా న్స్ఫర్ ఆర్డర్స్. నాన్నగారికి డెప్యూటీ సూపరింటెండెంట్ గా ప్రమోషన్ తో పాటు, హైదరాబాదుకు ట్రా న్స్ఫర్ చేసినట్లుగా అందులో ఉంది. మా అందరికి చాల సంతోషం వేసింది, మేము మళ్ళీ వెనక్కి హైదరబాదు వెళ్తున్నందుకు. మా నాన్నగారు నన్ను దగ్గరికి తిసుకొని " మా వరమ్మ ఏది చదివినా వేదంలా ఉంటుంది" అనగానే మా పెద్దన్నయ్య "ఆ ఇంగ్లీషు కూడా వేదంలా చదివితే నే, వినటానికి కష్టం" అని ఊడుకుమోతుగా అన్నాడు. అందరికన్న మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది, ఈ ఊళ్ళో అన్నయ్యల చదువు సరిగా సాగట్లేదని, చుట్టాల బెడద ఎక్కువయిందని ఆమె బాధ. హైదరాబాదులో అయితే బాగుంటుందని ఆమె ఆభిప్రాయం.కాని మా సంతోషము ఎక్కువసేపు నిలవలేదు. మేము హైదరాబాదు వెళ్ళటంలేదని నాన్నగారు ఒక 6 మంత్స్ డెప్యుటేషన్ మీద ఒక వరంగల్లు దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాలని చెప్పి, హెడ్ కాణ్స్టేబులు కోటేశ్వర్ రావు వచ్చి చెప్పాడు. అది కూడా వెంటనే బయలుదేరాలని అన్నాడు. మా అందరికి నీరసం వచ్చింది. మా నాన్నగారి తత్వం మాకు తెలుసు ఎక్కడికి ట్రాన్స్Fఅర్ ఆయినా అందరం వెళ్ళాల్సిందే. మా పెద్దన్నయ్యను మాత్రం మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంచి మేమందరం బయలుదేరాము. సామాను లారీలోకి ఎక్కించారు. మేమూ జీప్ ఎక్కాము. మేము ఆ ఊరు చేరేసరికి రాత్రి 11గంటలు అయ్యింది. జీప్ ఆగేసరికి నిద్రపోతున్న మేము లేచి చూచాము. అది ఒక పాత పోలీస్ స్టేషను, గేటు బయట ఒక సెంట్రి రైFఇల్ పట్టుకొని సెల్యూట్ చేసాడు.లోపల ఇంకా మూడు జీపులు ఉన్నాయి. మా నాన్నగారు దిగకముందే స్టేషను లోపలనుంచి బూట్లు టక టకలాడిస్తూ ఒక పదిమంది ఖాకీ దుస్తులు వేసుకున్న పోలీసు సిబ్బంది మా జీప్ దగ్గరకు వచ్చి సేల్యూట్ చేసారు. అందులో నలుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లని ఆ గుడ్డి వెలుతురులో వారి డ్రెస్సుకున్న స్టార్స్‌ని పట్టి నేను గుర్తుపట్టాను. నలుగురూ వచ్చి నాన్నగారికి సెల్Yఊట్ పెట్టి పరిచయం చేసుకున్నారు. వాళ్ళ మాటల బట్టి వారి లో ఆ ఊరి ఇన్‌స్పెక్టరు కాకుండా ఆచుట్టూ ఉన్న మూడు గ్రామల ఇన్‌స్పెక్టరులు కూడా ఉన్నారు. మా నాన్నగారు మధ్యలో పొడుగ్గా, గంభీరంగా అచ్చం 'షోలే' సినిమాలో 'సంజీవ్‌కుమార్ లాగా ఉన్నారు. మా నాన్నగారితో సహా అందరూ స్టేషనులోకి వెళ్ళారు.ఇంతలో ఆ ఊరి సబిన్‌స్పెక్టరు రాజ్‌కుమార్ గారు మా అమ్మ దగ్గరికి వచ్చి పరిచయం చేసుకొని నమస్కారం పెట్టాడు. ఆయన జీపెక్కి డ్రైవరుకి ఎటుపోవాలో చెప్పాడు. డ్రైవరు జీపుని రివర్సు చేసి పోలిస్ స్టేషను ముందు సందులోకి తిప్పి ఆ వీధి చివర ఉన్న నాలుగో ఇంటి ముందు ఆపాడు. అది ఆఊళ్ళోఉన్న అన్ని ఇళ్ళల్లోకి బెస్ట్ అని, మెజిస్త్రేటు రెడ్డిగారి తల్లి ఒక్కరే ఒకపోర్షనులో ఉంటారు, మిగతాదంతా మనకిందనే ఉంటుందమ్మా అని అమ్మకు చెప్తున్నాడు ఆ ఎస్సై. సామాను రేపు వచ్చి ఆర్‌డర్లీలు సర్దుతారు, మీకేంకావాలన్న ఇదిగో ఈ నరసిమ్హం ఉంటాడు అని చెప్పి స్టేషను కెళ్తున్నా అని వెళ్ళిపోయాడు. మేము ఇంటి లోపలికి వెళ్ళాము. "ఏంటక్కా అక్కడ నాన్నగారేమో 'షోలే' లో 'సంజీవ్ కుమాఋ అయితే ఈ ఇల్లేంటే శంకరాభరణంలో శంకరసాస్త్రి ఇల్లులా ఉంది" అన్నది మా చెల్లెలు. దాని మాట నిజమేఅనిపించింది. పెద్ద వీధి గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టగానే ఖాళీ ప్రదేశం, చుట్టూ కొయ్య స్తంభాలు,ఆస్తంభాలు దాటితే నాలుగు వైపుల నాలుగు మొత్తలు. పైన పెంకు కప్పు, నాలుగువైపుల నుంచి వర్షం నీరు ఆ ఖాళీ ప్రదేశంలొ పడతాయి. ఇంతలో లోపలనుంచి ఇంటావిడ బYఅటకు వచ్చి పలుకరించింది. "మా అబ్బాయి చెప్పాడమ్మా డి.ఎస్పీ గా రు వస్తారని, మామూలుగా ఈ పల్లెటూళ్ళఓ ఎవరూ వచ్చి ఉండరంంఆ, ఏ ఆఫీసరు గారొచ్చిన పట్నంలోనే మకాం", అని ఆమె అంటుంటే మా నాన్న గారి పద్ధతి అందరిలాగా కాదు లేండి అని మేము మా మనస్సుల్లో అనుకున్నాము. మా భోజనాలు ఏర్పాటు ఆవిడే చేసింది ఆ రాత్రికి. పొద్దున్నే ఎస్సై రాజ్ కుమార్ గారిని పిలిచి మమ్మల్ని స్కూలులో జాయిను చేసే ఏర్పాటు చూడమన్నారు మా నాన్నగారు, దానికి ఆయన సిటీలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ళూ ఉన్నాయండి, ఇక్కడైతే మరి గవర్న్మెంటు హైస్కూలుంది, అదీ తెలుగు మీడియం అదీ కాకుండా అది అంతగా ఏం బాగుండదు. పిల్లల్ని సిటీలోనే జాయిను చేయండి సార్ అని అన్నాడు ఆయన."మరేం ఫర్వాలేదు ప్రిన్స్‌పాల్ తో మాట్లాడి జాయిన్ చెయ్యండి" ఆని మా నాన్నగారు అనడంతో ఆయనతో పాటు అందరం నోరుమూసుకున్నాము. ఎప్పుడూ పల్లెటూరి స్కూల్లో చదవలేదు కనుకనో, లేక ఆ స్కూలు తీరే అంతేనేమో అంతా కొత్తగా ఉంది. నేను క్లాసు రూములోకి అడుగు పెట్టగానే ఒక్క క్షణం అనుమానం వచ్చింది అది తొమ్మిదవ తరగతేనా అని, ఎందుకంటే ముందు వరసలో కూర్చొని ఉన్న కొద్దిమంది పిల్లలు తప్ప మిగతా వాళ్ళంతా నాకంటే చాలా పెద్దగా ఉన్నారు. ఆడపిల్లలంతా ఓణీలు వేసుకున్నారు, మగపిల్లలంతా మీసాలతో, గడ్డాలతో ఎఋఋఅ రంగు, పచ్చ రంగు చొక్కాలతో ఏదో 'స్ట్రైకు ' చెయ్యడానికి అన్నట్టుగా రెడీ గా ఉన్నారు.లలిత అనే అమ్మాయితో స్నేహం అయ్యేసరికి అంత నిరుత్సాహంలో కూడా ఏదో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఇక స్కూలులో సామాన్య శాస్త్రంలో బొగ్గు పులుసు వాయువు కన్నా, గణితంలో లంబకోణం కన్నా అర్థం కాని విషయం, ఆ బడిలో ఉన్న మగపిల్లలు వాళ్ళని మాస్టారులు చూసే పద్ధతి. ఒక్కక్కొరు క్లాసురూములోకి లేటుగా వచ్చేవారు. కొంతమంది ఒకటో, రెండో పుస్తకాలు తెస్తే చాలా మంది అసలు పుస్తకాలే లేకుండా వచ్చే వారు. మాస్టారులు ఏమీ అనే వారు కారు. ఆ రోజు ఆదివారం స్కూలుకు వెళ్ళనక్కరలేదు అని అనుకుంటే, పొద్దున్నే సుప్రభాతంలా ఎవరో రాగం తీస్తుంటే మెలుకవవచ్చింది. ఏమిటీ గొడవ అని లేచి బయటకు వచ్చి చూచాను. అది సుప్రభాతం కాదు, సంగీతం అంత కన్నా కాదు, అది ఒక అమ్మాయి రోదన. మా ఇంటికి రెండిళ్ళ అవతల ఒక Yఉవతి వాళ్ళ ఇంటి వసారాలో కూర్చుని నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తోంది. మధ్య మధ్యలో ఏదో అంటోంది. అవి తిట్లో, శాపనార్థాలో, ఇంతకీ అవి ఎవరిని ఉద్దేశ్యించో కూడా నాకు అర్ధం కాలేదు. అంతలో ఆ ఇంట్లో నుంచి ఒక పెద్దావిడ బయటకొచ్చింది. ఆ అమ్మాయిని ఆపమన్నట్లుగా సైగ చేస్తోంది. ఉన్నట్టుండి మా ఇంటి వైపు చూపించి ఏదో చెప్పింది. ఆ ఆఅమ్మాయి ఒక క్షణం ఏడుపు ఆపి నా వైపు చూచి మళ్ళీ ఏమి జరగనట్లుగా యధావిధిగా తన ఏడుపు ప్రారభించింది. నేను ఇక అక్కడ ఉండటం బాగుండదని లోపలకి వచ్చేశాను. నేను లోపలకి వచ్చేసరికి, " ఆ! ఈ ఏడుపు గోల రోజూ ఉండేదే, ఆ సౌందర్యని మొగుడు వదిలేసిన దగ్గర్నుంచి ఇదే తంతు" అని మా ఇంటావిడ మా అమ్మ తో అంటోంది. నాకు అంతలో గుర్తుకొచ్చింది ఈ వేళ ఊరు చూపిస్తానంది లలిత. నేను తయారయ్యి బయటకు వచ్చేసరికి, లలిత నాకొసం ఎదురుచూస్తోంది. మా నాన్నగారు కుడా ఎక్కడికో బయలుదేరారు, జీప్ రోడ్డు మీదకి రాగానే అంతగా రోదిస్తున్న సౌందర్య, టక్కున ఏడుపు ఆపేసి లోపలకి వెళ్ళిపోయింది. నేను లలితా ముందుగా పోలీసు స్టేషను ముందు ఉన్న రాతి బురుజు దగ్గరకు వెళ్ళాము. ఆ బురుజు చాలా ఎత్తుగా ఉంది. ఒక పక్క అంతా కూలిపోతోంది. దాని మీదకెక్కితే ఊరంతా చూడొచ్చు అంటోంది లలిత. లోపలనుంచి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి కాని తుప్పలు పెరిగి పైకి వెళ్ళటానికి వీలులేకుండా ఉంది. ఎవరో మేకల్ని కాసుకుండే పిల్లలు మాత్రం సునాయసంగా ఎక్కేస్తున్నారు ఆ మేకలతో పాటే. వెనుకటి రాజుల వైభవానికి ఆ తరువాత జరిగిన ఎన్నో దండయాత్రలకి , ఇప్పుడు ఆ పోలీసు స్టేషనులో, ఆ ఊరిలోనూ, జరుగుతున్నూ, ప్రతి విషయానికి మూగ సాక్షి లా నిలుచొని ఉన్నదా బురుజు. అదిగో ఆ పోలీసు స్టేషను, బడి, గుడి, కోమట్ల బజారు తప్ప ఇక ఆ ఊళ్ళో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు. అక్కడ ఉన్న మనుష్యులు కూడా నా ఉద్దేశ్యంలో రెండే రకాలు. భూమి ఉన్న వాళ్ళు, భూమి లేని వాళ్ళు. కాకపోతే ఇంకో రకం ఎవరంటే జలగల్లాగా వడ్డీలతోనూ, తప్పుడు పద్దులతోను అమాయకులైన కూలివాళ్ళను పీల్చి పిప్పి చేసే వ్యాపారులు, దుకాణదారులు. ఎక్కడ చూచిన పేదరికం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇక వేసవి కాలంలో అయితే పంటలు ఉండవు కాబట్టి కూలి, నాలి చేసుకునే వారంతా పొట్ట చేత పట్టుకొని పట్నం వెళ్ళ వలసిందే. ఇవన్నీ నాకు అక్కడకు వచ్చిన పది రోజులలోనే అర్ధం అయిన విషయాలు. ఆ రోజు సాంఘిక శాస్త్రంలో, రష్యన్ విప్లవం గురించి, మా మాస్టారు, ఆయనకు నచ్చిన టాపిక్ అవడంతో ఎంతో ఉత్సాహంగా పాఠం చెప్పుకుపోతున్నాడు. ఆ రోజు క్లాసు రూమూ నిండుగా ఉంది. ఎన్నడూ చూడని మొహాలు కూడా ఆ రోజు కనబడుతున్నాయి. పాఠం జరుగుతున్నంత సేపు అబ్బాయిలు ప్రశ్నలు వేస్తూనేఉన్నారు. వాళ్ళకు లెనిన్ గురించి మార్క్స్ గురించి తెలిసినంతగా బహుశా, ఆ రష్యాలొ కూడా ఎవరికి తెలీదేమో అనిపించింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి "మనం క్లాసు అయ్యినతరువాత మాట్లాడదామని" అనేసరికి, చాలా మంది ఆయన మీద గౌరవంతోనో లేక మాకు తెలుసులే అన్న ధీమాతోనో తెలియదు కాని ఊర్కున్నారు. ఆ ఊరు పరిస్థితికీ ఈ అబ్బాయిల్లో ఈ మార్క్సిజం మీద ఉన్న ఇంట్రెస్టుకూ ఉన్న సంబంధం సబబే అనిపించింది.మొదట రాజ్యాల కోసం తీరిక లేకుండా ఒకరితో ఒకరు పోట్లాడుకున్న రాజుల నిర్లక్ష్యానికి గురై, ఆ తరువాత వచ్చిన భూస్వామ్యుల దగ్గర వెట్టి చాకిరికి తలవంచి అన్యాయంగా బలి అయిపోయిన జీవితాలు వీళ్ళవి. నాకు దాశరధి గారి "చిల్లరదేవుళ్ళు" నవల జ్ఞాపకం వచ్చింది.మరి ఇప్పుడు భూస్వాములు లేరు,వెట్టిచాకిరి లేదు, కాని వీరి జీవితాలాలలో మటుకు ఏమాత్రం మార్పు వచ్చినట్లు కనబడదు. ఏదో మార్పు తఈసుకొనిరావలన్న తపనే వీరిచే అజ్ఞాతంగా పోరాటం సాగించేలా చేస్తోంది. ఎంతకాలం ఈ పోరాటం, దేశానికి ఉపయోగ పడవలసిన యువతీ, యువకుల భవిష్యత్తంతా ఈ తీరని వేదనతొ విప్లవ కాంక్షకు బలి అవ్వడం చాలా అన్యాయమనిపించింది. స్వార్థపరులైన కొద్దిమంది, రాజకీయ దురాలోచనలతో అటు ప్రభుత్వ వనరులను, ఇటు ఈ అమాయక ప్రజల భవిష్యత్తును తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం వలన, ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం నశించింది. దీని కారణంగా, ఎంతోమంది పోలీసు అధికారులు సదుద్దేశ్యంతో, నిజాయితిగా పనిచేసినా ఫలితాలు కనిపించడంలేదూ. ఈ ఆలోచనలతొ నాకు ఎప్పుడు నిద్రపట్టిందొ కూడా తెలీదు. పొద్దున్నే అమ్మ వచ్చి లేపడంతో "ఏమిటి ఈ రోజు సౌందర్య మేలుకొలుపు పాడలేదబ్బా అనుకుంటూనే స్కూలికి తయారయ్యి వెళ్ళాను.నేను స్కూలు నుంచి వచ్చేటప్పుడు చూశాను, సౌందర్య పోలీస్ స్టేషను నుంచి బయటకు రావడం వెంట వాళ్ళ అమ్మ కూడా ఉంది. "బాగా ఏడుస్తుందని పోలీసు వాళ్ళు బెదిరించటానికి తీసికేళ్ళి ఉంటారు" అని పక్కన ఉన్న లలిత అన్నది. నాకు మాత్రం అలా అనిపించలేదు, ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇంటికి వచ్చేసరికి బయట నాన్నగారి ఆఫీసు రూములో ఏదో మీటింగ్ అవుతోంది. నలుగురు ఎస్సైలతో పాటు ఆరోజు కమాండెంటు గారు కూడా ఉన్నారు ఆయన సిటీలోనే ఉంటారు అప్పుడప్పుడు వస్తుంటారు. మేము లోపల భోజనం చేస్తున్నాము.ఉన్నట్టుండి సడన్‌గా నాన్నగారి గొంతు పెద్దదయ్యింది. "Don't you know even those bits of paper which you have left at the site of operation could make a big piece of eviedence, they would think we are fools" అని ఎస్సై రాజ్‌కుమార్‌గారితో అంటున్నారు. ఆ తరువాత చాలా సేపు ఏదో నడుస్తూనే ఉన్నది. ఆ రోజు నాన్నగారు క్యాంప్‌కెళ్తున్నారు, రెండు రోజులలో వస్తారని అని అమ్మ చెప్పింది. నేను లలితా వాళ్ళ ఇంటికి పాట ప్రాక్టీసు చేయడానికి కి వెళ్ళాను. మా తెలుగు టీచరు నన్ను లలితను గాంధీ జయంతి సంధర్భంగా ఒక పాట పాడమంది. మెఏము ఎంతో కష్టపడి గాంధీ గారి మీద ఒక పాట నేర్చుకొని మైకు దగ్గరకు వెళ్ళి పాడాము. ఇక, ఆ తరువాత ఇదే అవకాశం అనుకొని ఒకరి వెనకాల ఒకరు చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు తమ గళం విప్పి తమ మనస్సుల్లోని ఆవేదనను పంచుకున్నారు. అందులో ఒక అబ్బాయి పాడిన పాట నేనెప్పట్కి మరచిపోలేను. " ఓ పాల బుగ్గల జీతగాడ పాలు తాగి ఎన్నాళ్ళయ్యిందో " అని అందులోని ఈ చరణం ఎంతటి రాతి గుండె కలవాడికైన కన్నీరు తెప్పిస్తుంది అనిపించింది.మేము వచ్చి అయిదు నెలలు కావస్తోంది. ఈ అయిదు నెలలఓ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. బడిలో నేర్చుకున్న చదువుకన్న ప్ర్సత్యక్షంగా ఆ ఊళ్ళో రోజూ జరిగే విషయాలే నాకు జీవితాఆంతాం గుర్తుండేలా ఎంతో విలువైన పాఠాలు నేర్పాయి. నాన్నగారు అన్న మాటలు నిజమే అనిపించింది. మేము ఇంగ్లీషు మీడియం కోసం అని సిటీకి వెళ్ళకుండా ఉండటం నాకు అంతగా బాధ అనిపించలేదు. ఇలా ఆలోచిస్తూ ఇంటికి చేరేసరికి, మా ఇంటి వసారాలో ఇంటావిడ, మా అమ్మా ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. సౌందర్య కనిపించుటలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఏమీ తెలీదట అని అమ్మ నాతో అన్నది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నేను సౌందర్యని ఎప్పుడు చూశానా అని ఆలోచించాను. రెండు రోజుల క్రితం పోలిస్టేషను లోంచి జీప్ లో ఎక్కి ఎక్కడికో వెళ్ళడం చూశాను. అందులో ఎస్సై రాజ్‌కుమార్ కూడా ఉన్నారు. నాకు చాలా భయం వేసింది. అమ్మతో ఆ మాట చెప్దమా అనుకొని ప్రక్కనే ఉన్న ఇంటావిడని చూసి ఊరుకున్నాను. నేను బడికి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ సౌందర్య ఇంటిముందు ఆగి చూశాను, ఆఇంట్లో వాళ్లు ఏమీ జరగనట్లు మామూలుగానే ఉన్నారు. మేము ఇంకో వారం రోజులలో హైదరబాదు వెళ్తున్నామని అమ్మ చెప్పింది. ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఎందుకో ఆ ఊరు వదిలి వెళ్ళటం నాకు నచ్చలేదు. సమయానికి లలత కూడా ఊళ్ళో లేదు. వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్లింది. వాళ్ళింటికెళ్ళి, లలితకు ఉత్తరం వ్రాస్తాను అని వాళ్ళ అమ్మగారికి చెప్పి వచ్చాను. వచ్చేటప్పుడు కాసేపు ఆ బురుజు దగ్గర ఆగాను. అక్కడనుంచి పోలీస్టేషనుకేసి చూశాను. నాన్నగారు వచ్చిన అప్పటినుంచి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు సెంట్రి వేళ తప్పకుండా డ్యూటి చేస్తున్నాడు. అబ్దుల్ లోపల లాకప్‌లని శుభ్రంగా ఉంచుతున్నాడు. ఎస్సై రాజ్‌కుమార్ గారు కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆ రావి చెట్టుమీద కాకులు కూడా అరవడం తగ్గించినాయి. దారిలో సౌందర్య ఇంటి ముందుకూడా ఒక నిముషం ఆగాను. చాలా నిశ్శబ్ధంగా ఉన్నది. ఇంతకు మునుపు లాగా సౌందర్య బయట వసారాలో కూర్చొని లేదు. ఇప్పుడు ఆ ఏడుపు కూడా వినపడదు. నాకు మాత్రం సౌందర్య ఎమైపోయిందొ అర్థం కాలేదు. ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి, ఎమైనా ఇక చేసేదేముంది అనుకొని ఇల్లు చేరాను. సామాను లన్నీ లారిలోకి ఎక్కిస్తున్నారు. ఆ ఊరి వాళ్ళు చాలా మంది బయట గుమి గూడి ఉన్నారు. అందరితో చెప్పి మేము జీప్ ఎక్కాము. జీప్ పోలీస్టేషను ముందు ఆగింది. నాన్నగారికి వీడ్కోలు చెప్పడానికి మళ్ళీ ఆ నలుగురు ఎస్సైలు, కాన్స్టేబుల్స్ అంతా జీప్ దగ్గరికి వచ్చారు. నాన్నగారు అదంతా అయ్యి జీప్ ఎక్కేసరికి అరగట పట్టింది. మళ్లి ఆందరు వచ్చి అమ్మ దగ్గర కు డా సెలవు తీసుకున్నారు. జీప్ వరంగల్ హైదరాబాదు హైవేఎక్కింది. మేము హైదరబాదు వచ్చి అప్పటికి ఏడాది పైన అయ్యింది. లలితకి నాకూ మధ్యలో ఉత్తరాలు నడుస్తూ నే ఉన్నాయి. నేను జూనియర్ కాలేజీ లో జాయినయ్యాను. ఒక రోజు నేను కాలేజికని రెడీ అవుతున్నాను. ఇంతలో బయట హాలులో నాన్నగరు ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం వినిపించింది. అది ఎస్పీ యాదగిరిరెడ్డి అంకుల్ గొంతు. అమ్మ కాఫీ కలిపితే ఇవ్వడానికి వెళ్ళాను. "ఏం అమ్మా కాలేజి ఎలా సాగుతోంది" అని అడిగారుఆయన్. "బాగానే ఉందండి No problem at all" అని లోపలకు వచ్చాను.ఇంతలో ఇంకా ఎవరివో కొత్త గొంతులు వినపడ్డాయి. ఎవరా అని నేనూ మా అమ్మా కర్టెన్ తొలగించి చూశాము. ఒక ఇద్దరు భార్యా భర్తలు ఒక చంటి పిల్ల వాడితో నాన్నగారి కాళ్ళకి దణ్ణం పెడ్తూ కనిపించారు. నేనూ అమ్మా ఇద్దరమూ ఆమెని గుర్తు పట్టాము. ఆమె ఎవరో కాదు సౌందర్య ! చాలా ఆశ్చర్యం వేసింది! మా నాన్నగారు వారి గురించి Yఆదగిరి రెడ్డి అంకుల్ కు చెప్తున్నారు. "This girl was in total depression when this guy joined the group after their marriage. But we have to appreciate her cooperation, she helped us find him and later he agreed to convert himself into a police informer." ఇప్పుడు సి.బి.సి ఐడి లొ పని చేస్తున్నాడు. నేనూ అమ్మా స్థాణువుల్లాగా స్థబ్దతతో నిల్చుండిపోయాము. సౌందర్య బాబు నెత్తుకొని లోపలకు వచ్చి అమ్మకు కూడా దణ్ణం పెట్టింది. నేను నా ఆలోచనలకు ఆనకట్ట వేయలేకపోతున్నాను. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది,ఎలా జరిగింది? పిచ్చిదానిలాగా ఉండే ఈ సౌందర్య వెనకాల ఇంత కథ ఉండిందా ? అసలు అప్పటి సౌందర్యకు ఇప్పటి సౌందర్యకి పోలికే లేదు. ఇప్పుడు మనిషి చాలా బాగుంది. మాటలో మర్యాద, నాగరికత కనబడుతున్నాయి. బయట, నాన్నగారు ఎంతో ఉత్సాహంగా యాదగిరిరెడ్డికి అంతా చెప్తున్నారు. ఆయన కళ్ళల్లో ఒక జంట జీవితం బాగు చేయ కలిగానన్న సంతృప్తి కనబడుతోంది. మా నాన్నగారి కార్య దీక్షత, ఉద్యొగం పట్ల ఉన్న బాధ్యత నన్ను చాలా గర్వపడేటట్లు చేసింది. ఆ రోజు నేను పరిపరి విధాల ఆలోచించినందుకు మనస్సులొనే క్షమా పణలు చెప్పుకున్నాను. "వరమ్మా నీ ఫ్రెండ్స్ బయట్ వెయిట్ చేస్తున్నారమ్మా" అని మా నాన్నగరు పిలిచేసరికి నేను గబాగబా చెప్పులు వేసికొని బయటకు వెళ్ళాను. నా మనస్సు చాలా తేలికగా ఉందిప్పుడు. ఎన్నాళ్లనుంచో నా మీద ఉన్న భారం ఒక్కసారిగా తొలిగిపోయినట్లు అనిపించింది. వెంటనే లలితకు ఉత్తరం వ్రాయాలి అనుకొని క్లాసు రూములోకి అడుగు పేట్టాను.

గోపాలసామి

గోపాలసామి

- విరించిప్రియ

మేము హైదరాబాదు నుంచి బయలుదేరిన అయిదు గంటలకు కాని బాణాపురం చేరలేదు. మేము బాణాపురంలో బస్సు దిగేసరికి మధ్యాహ్నము పన్నెండయ్యింది. ఎండ మండి పోతుంది, బస్సులో జనం మధ్య ఉక్క పోసి వళ్ళంతా చెమటతో తడిసి పోయింది. కాని, బస్సు దిగిన తరువాత కచ్చడం బండిని, ప్రక్కనే మా కోసం నిల్చొని ఉన్న ఖాసింను చూసేసరికి నాకు, తమ్ముళ్ళిద్దరికీ ప్రాణం లేచి వచ్చింది.
ప్రయాణం అలసట, వేడి, ఎండ, అన్ని ఎగిరిపోయాయి.అది మాకోసం మండవ నుంచి ఆమ్మ పంపించిందని వెంటనే మేము గుర్తు పట్టాము. ఇంతలో ఖాసిం మా దగ్గర నుంచి మా పెట్టెలందుకున్నాడు. నా చేతిలో బాగ్ తో నేను బండి ఎక్కాను. "బాగున్నావా ఖాసిం, దేవుడిపెళ్ళి పనులు ఎలా సాగుతున్నాయి" అని అడిగాను. "ఇంక మీరు వచ్చారు కదా అమ్మాయిగారు ఇక సందడే సందడి" అని తెగ సంబర పడిపోయాడు.ఖాసిం మా ఆమ్మ వాళ్ళ జీతగాడు, మా చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే జీతం చెస్తున్నాడు. ఆ బండికి కట్టి ఉన్న రెండు ఎడ్లని చూసి, "ఇవి సింగడు, రంగడు కదా, మరి గోపాలస్వామిని ఎందుకు తేలేదు" అని అడుగుతున్నాడు మా చిన్నతమ్ముడు. "గోపాలస్వామిని అరకకు కట్టారండి అబ్బాయి గారు," అని చెప్తున్నాడు ఖాసిం. మా పెద్దతమ్ముడు ముందుగా ఎక్కి ఖాసిం పక్కనెళ్ళి కూర్చున్నాడు. ఇక మా చిన్నతమ్ముడు చేసేది ఏమి లేక నాతో వెనకాల కూర్చున్నాడు. బస్సు కన్న బండి ఎంతో హాయిగా ఉంది. పరుపుమీద చేరి కూర్చొని నేను పచ్చని పొలాల్ని చూస్తు వాళ్ళ మాటలు వింటున్నాను. ఎడ్లని ఉరికించమని తమ్ముళ్ళిద్దరు పట్టు పట్టటంతో ఖాసిం ఉత్సాహంతో ఛండ్రకోళ గాలిలో ఝుళిపించాడు. బండిని వేగాంగా పరిగెట్టిస్తూ, ఈ ఏడాదిలో ఎన్ని కోడెదూడలు పుట్టాయో, ఎన్ని లేగ దూడలు పుట్టాయో,వాటికి పెద్దనాన్నగారు ఏం పేరులు పెట్టారో అన్నీ చెపుతున్నాడు ఖాసిం.దేవుడి పెళ్లికి రికార్డ్ డాన్సు ట్రూపు ఊళ్ళోకి వచ్చేసిందని సంబరంగ చెప్తున్నాడు ఖాసిం. మా తమ్ముళ్ళు అప్పుడే, గుమాస్తా రామలింగగారిని ఎల ఏడిపించాలో స్కీములు కడుతున్నారు. ఖాసిం కూడా వాళ్ళతో కలిసిపోయాడు. వాడికి కూడ వీళ్ళ ఆటలంటే బాగానే సరదా. మేము వెళ్ళేసరికి ఒంటిగంటయ్యింది. ఆమ్మ, పెద్దనాన్నగరు బయట వసారాలో కూర్హొని ఉన్నారు. నేను బండి దిగి వెళ్ళి ఆమ్మను చుట్టేసాను. "అమ్మో! అమ్మో! ఎండంతా మీ పాలే అయ్యిందా అని ప్రేమంతా కురిపిస్తూ నన్ను దగ్గరకు తీసుకొని, "అమ్మ బాగుందానే, ఎప్పుడు తిన్నారో ఏమో కాళ్ళు కడుక్కోండి భోజనాలు వడ్డిస్తాను" అని వంట ఇంట్లోకి దారి తీసింది మా ఆమ్మ. మేము కాళ్ళు కడుక్కోవడానికి పెరట్లోకెళ్ళాము.
బాగున్నారా అమ్మాయిగారు అంటూ, ఖాసిం అక్క మదార్బి, పలకరించింది. "బాగానే ఉన్నాం మదార్బీ, నీ కొడుకెలా ఉన్నాడు, మీ అక్క అలీమా బాగుందా, అని అడిగాను."అమ్మో అమ్మాయిగారికి అంతా గుర్తే" అని, అది ఆ ఒక్క మాటకే మురిసిపోయింది. మనకు పట్టణాలలో దొరకనిది ఇక్కడ ప్రతి మనిషిలో పుష్కలంగా ఉండేది ఈ అమాయకత, ఆప్యాయతే, అని అనుకుంటూ, అది ఇచ్చిన తువ్వాలందుకున్నాను. ఎప్పటిలాగానే ఆమ్మ ఎంతో రుచిగా మా కోసం చాలా చేసింది. మేము మాత్రం ఆమ్మ పెట్టిన కొత్తావకాయా, గోంగూర పచ్చడి, వెన్నతో కలిపి లాగించాము. తింటున్నంత సేపూ అమ్మ ఎలా ఉన్నది అని వాళ్ళ చెల్లెలు గురించి తెగ బాధ పడి పోయింది మా ఆమ్మ.భోజనాలయ్యింతరువాత మా ఆమ్మ, పూజారి, వరదాచార్యులగారు వస్తే ఆయనకు కావలసినవి ఇవ్వటానికి లేచి వెళ్ళింది. తమ్ముళ్ళిద్దరు ఖాసింతో ఊళ్ళోకెళ్ళారు, నన్ను వెళ్ళనీయదు నాకు తెలుసు,"నువ్వు ఆడపిల్లవి ఇది మీ హైదరబాదు కాదు" అని స్తోత్రం మొదలు పెడ్తుందని ఊరుకున్నాను.నేను బయట వసారాలోకెళ్ళి కూర్చున్నాను. వాకిట్లో ఎర్క్ర్క మట్టితో గోడల్ని అలికి, సున్నముతో పట్టీలు గీస్తున్నరు చాకలి నర్సు, వాడి భార్య. ఎంతో అందంగా ముస్తాబవుతున్న ఆ గోడల్ని తన్మ్యంగా చూస్తున్నాను.
అంతలో గొల్లరాముడు తను తోలుకొచ్చిన పషువుల్ని పెరట్లోకి తోలుకొని పోతు "ఓ అమ్మాయిగారెప్పుడొ వచ్చినట్లున్నారే!, అబ్బాయిగార్లు కూడా వచ్చారండి" అని పలకరించాడు. నేను వాడితో మాట్లాడుతూండగా, మా ఆమ్మ "లతా ఇంట్లోకి రా పషువులు వచ్చేవేళ అయ్యిందీ" అని పిలిచింది. మా ఆమ్మకున్న మడి ఆచారాల్లలో ఇది ఒకటి. ఆవిడ ఒక సనాతన ధర్మాలు కల మనిషి. పొరపాటున ఎవరైన అంటరాని వారిని తాకితే నలభై సార్లు స్నానం చేయిస్తుంది. ఎన్ని ఆచారాలు ఉన్నా ఆమె మనస్సు చాల సున్నితమైనది. ఎవరినీ ఎన్నడూ నొప్పించి ఎరగదు. ఆఖరికి పిల్లలు లేరన్న బాధ కూడా ఎప్పుడూ బయట పెట్టదు. ఆ ఊరివారి కష్టసుఖాలు కనుక్కుంటూ, అందరికీ చేతనయైన సహాయం చేయడమే ఆమెకు తెలిసినది.దానికి తగ్గట్టుగా మా పెద్దనాన్నగారు కూడా దైవభక్తి, సహ్రుదయం కలవారు. ఆయనకు ఆఊరి కరణంగా మంచి పేరు. నేను లోపలికి వెళ్ళేసరికి వరదాచార్యులగారు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు.
నన్ను దగ్గరికి పిలిచి ఆమ్మ నాచేత ఆయన కాళ్ళకి మొక్కించింది. ఆయన"సకల విద్యాప్రాప్తిరస్తు" అని దీవించి వెళ్ళారు. నేను ఆయన వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకున్నాను. దానికి మా ఆమ్మ "తప్పు ఆయన సాక్షాత్తుభగవత్ స్వరూపులు ఆయన వంటి మీదకు ఆంజనేయుడు వస్తుంటాడు" అని అంటుంటే చెంపలేసుకొని "ఆమ్మా! ఇంక చాల్లే కాని నాకు కాఫీ పెట్టీవ్వవూ, నీ చేతి కమ్మటి కాఫీ తాగి ఎన్నాళ్ళయ్యిందో" అని ఆమెను వంటింట్లోకి తీసికెళ్ళాను. "చూసారా మిమ్మల్ని ఎలా తెలివిగా బుట్టలో వేసుకుంటుందో అమ్మాయిగారు" అంటూ వంటింట్లోకి వచ్చారు గుమాస్తా రామలింగంగారు."ఆ మీరు కూడా మా ఆమ్మ కాఫీ కోసమేకదండి ఇలా వచ్చింది, మీ హుషారు చూస్తుంటే, మా తమ్ముళ్ళిద్దరు ఇంకా మీకు ఎదురు పడ్డట్టు లేదు", అనేసరికి, అమ్మో అబ్బాయిగార్లు వచ్చే లోపు నేను పొలానికెళ్ళాలి లేకపోతే వాళ్ళూ వస్తామని గొడవ చేస్తారు అని పిలక సర్దుకుంటూ కాఫీ గ్లాసు కడిగి బోర్లించి, హడావిడిగా బయటకెళ్తుంటే నాకు ఆమ్మకు నవ్వాగలేదు.
దేవుడిపెళ్ళ్కి ఇక రెండు రోజులే ఉన్నది. ప్రతి ఏడాది లాగానే ఆ ఏడు కూడా గుడి బయట అంగళ్ళు తెరిచారు. డ్రామాలు వెయ్యటానికి వీలుగా ఒక స్టేజి కూడా ఏర్పాటు చేసారు. ఆరోజు సాయంత్రం అందరం డాబా మీదకెక్కి, గుడి బయట జరిగే హడావిడి అంతా చూస్తున్నాము."ఇక చీకటి పడ్తోంది కిందకువెళ్ళి భోజనాలు చేద్దాం" అని ఆమ్మ మంచం మీదనుంచి లేచింది.డాబా మీద చల్ల గాలికి ఎవరికి కదల బుద్దవ్వలేదు,ఎప్పటిలాగా వెన్నెలలో ఇక్కడే కూర్చొని తిందాం అని ఆమెను అక్కడే కూర్చోపెట్టి, మేము అన్నీ తేవడనికి కిందకు పరిగెత్తాం. "ఆ వేడి పప్పుచారు జాగ్రత్త! నెయ్యి అంట్ల గిన్నెలతో కలపద్దు"! అని వెనకాల నుంచి ఆమ్మ అంటోంది. "ఏం ఫరవాలేదామ్మా మాకు తెలుసుగా, నెయ్యి గిన్నె వేరే పెట్టాలి, ఖాసింను ముట్టుకోనీయద్దు, దేవుడి గదిలోకి వెళ్ళద్దు, మడి బట్టలు తాకొద్దు, అని మా పెద్దతమ్ముడు లిస్ట్ చదివాడు. వెనకాలనుంచి ఆమ్మ పెద్దనాన్నగరు నవ్వడము వినిపించింది. ఆమ్మ అందరికి వడ్డించింది మేమంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటు తింటున్నాము."పప్పుచారు చాలా బాగుందామ్మా ఇంకోసారి అని మేము ముగ్గురము పోటీపడి వంతులేసుకొని తింటున్నాము. ఇంతలో మెట్ల మీదనుంచి దగ్గు వినిపించింది.ఖాసిం ఇంకా చీకట్లో మెట్ల మీదకూర్చొని ఉన్నాడు. మేమందరము తిన్న తరువాత గాని వాడు తినడు. నాకు జాలేసింది. కానీ ఆమ్మ ఆచారాలు కూడా తెలుసు. వాడిని అక్కడే తిననీ అని ఎన్నోసార్లు అడిగాను.ఆమె ఒప్పుకోదు ఎందుకంటే ఆమె అలా పెరిగింది. "ఇదీ పల్లెటూరమ్మా ఇక్కడ కట్టుబాట్లు వేరు, మనమూ అలానే నడుచుకోవాలి", అని నాకు సర్ది చెప్పేది, వాదించి లాభం లేదు. ఆమె ముఖంలోకి అలానే చూస్తున్నాను అబ్బ ఆమ్మకు ఎంత ఓపిక, ఆమె ముఖం మీద నవ్వు ఎప్పుడు చెరగదు. ఆమెది జాలి గుండే,కాని ఆమెలో జీర్ణించుకుపోయిన సనాతన ఆచారాలు, ధర్మాలు ఆమెను ఈ పని మాత్రం చేయనివ్వవు. లతా పెరుగేసుకోకుండా లేవకు అని మా ఆమ్మ పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చాను. తమ్ముళ్ళిద్దరు మాపెద్దనాన్నగారి దగ్గరకు చేరి సింగడూ, రంగడూ కథలు చెప్పమని అడుగుతున్నారు. మా పెద్దనాన్నగరు వాళ్ళ ఎడ్లకి పేర్లు పెట్టి వాట్ని హీరోలుగా కథలల్లి చెప్తారు. అవి అంటే మా అందరికి చాలా ఇష్టం.ఆ కథలో గోపాలస్వామి అనే ఎద్దు ప్రమాదస్థితిలో ఉంటే సింగడు, రంగడు వెళ్ళి ఎలా కాపాడాయో ఎఓతో నేర్పుగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చెప్పుకు పోతున్నారు. అది వింటూ మేమంతా ఎప్పుడో నిద్రలోకి జారిపోయాము. కింద ఏదో అలజడి వినిపించింది. "దొరగారు,దొరగారు, అంటూ ఖాసిం అరుచుకుంటూ మేడమెట్లెక్కుతున్నాడు. మేమందరం ఉలిక్కి పడి లేచాము. మా చిన్నతమ్ముడు లేచి "బొడ్డెంకన్న దొంగ మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడా ఏమిటి" అని అన్నాడు. దానికి మా పెద్దనాన్నగారు నవ్వుతూ "వాడొస్తే నీకేం భయం రా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ కదా షూట్ చేసెయ్" అని నవ్వుతున్నాడు. అంతలో ఖాసిం మేడ మీదకొచ్చాడు.
"అయ్యా గోపాలసామి తాడు తెంచుకొని నీళ్ళకని లోనికొచ్చి బావిలో పడింది" అన్నాడు. మా ఆమ్మ వెంటనే "అయ్యో! ఏమిటీ పరీక్ష స్వామీ నీ కార్యంలో ఏం లోపం జరిగింది అని అనుకుంటూ చెంపలు వేసుకుంటూ, దండాలు పెడ్తూ లేచింది. "గుమాస్తా రామలింగంగారికి కబురుపంపండి, అలాగే రొడ్డెంకణ్ణి, సాంబయ్యను, పటేల్ బక్షిమియాకి కబురు పంపండి. ఊళ్ళోకి వెళ్ళి పెట్రోమాక్స్ లైట్లు,గేలాలు, మోట తాళ్ళుతెమ్మని చెప్పు, నేను వస్తున్నాను పద అని మా పెద్దనాన్నగారు కూడ మంచందిగారు. "గుమాస్తా గారికి పటేల్కి కబురుపంపానండి అంటూ ఖాసిం, క్షణం ఆలస్యం చేస్తే ఏమౌతుందో అన్నట్టు వేగంగా కిందకు దారితీసాడు. మా పెద్దనానగారు నడిచి వెళ్తుంటే ఆ వెన్నెల వెలుతురులో ఆయన ముఖం స్పష్టంగా కనబడుతోంది, ఆయన ముఖంలో ఎప్పుడూ చూడని ఒకలాంటి గంభీరత, కార్య దీక్షకనబడ్డాయి. మేమంతా మా ఆమ్మ మంచం మీదకు చేరాము. మా అందరికి తెలుసు, గొపాలసామి అంటే ఆమ్మకు చాల ఇష్టం అయిన ఎద్దు అని, అందుకే ఆమె కళ్ళు మూసుకొని విష్ణుసహస్రనామాలు చదువుకుంటూ ఉంటే మేము మాట్లాడుకుండా కూర్చున్నాము. అప్పుడే ఈ విషయం ఊరంతా ప్రాకినట్లుంది. అక్కడక్కడ పెట్రోమాక్స్ లైట్లు, లాంతరలు కనబడుతున్నాయి. మా ముగ్గురికీ కిందకెళ్ళాలని ఉంది కాని ఆమ్మ పరిస్తితిని చూసి ఊర్కున్నాము. అంతలో ప్రక్కింటి భధ్రమ్మ ఒక పెద్ద లాంతరు పట్టుకొని "దొరసానిగారూ" అంటూ మేడమీదకొచ్చింది. భధ్రమ్మ తెచ్చిన లాంతరు సాయంతొ అందరం కిందకెళ్ళాము.మేము కిందకెళ్ళేసరికి ఊరంతా బావి చుట్టూ ఉన్నట్టుంది. బోలెడు పెట్రోమాక్స్ లైట్లు, అందులో జెవరు ఎవరో తెలీకుండా ఉన్నది.
గుమాస్తా రామలింగంగారు కండువా నడుంకి చుట్టి బావి గట్టు మీద నిలబడి అందరికి పనులు పురమాయిస్తున్నారు. ప్రక్కనే మాదిగ రొడ్డోడు, పెట్రొమాక్స్ లైటు పట్టుకొని బావి లోకి తొంగి చూస్తున్నాడు. వాడు నడుంకి ఒక గోచి గట్టిగా బిగించి కట్టి ఉంది. లైట్ల వెలుతురులో నల్లగా మెరుస్తున్నాడు. సాంబయ్య బావిలో దిగడానికి నడుంకి తాడు కట్టుకుంటున్నాడు. ఖాసిం ఒక బలమైన పలుపు తాడుని బావి గిరక మీద నుంచి ప్రక్కనే ఉన్న ఇనప దూలానికి గట్టిగా బిగిస్తున్నాడు. అక్కడ ఉన్న జనమంతా తలా ఒక రకంగా జరిగిన దాన్ని గురించి చర్చించుంకుంటున్నారు. "అసలు అంత పెద్ద ఎద్దు బావిలో ఎలా పడ్డదండి" అని అడుగుతోంది భధ్రమ్మ పక్కనే ఉన్న తన భర్తను. దానికి ఏసుపంతులుగారు "ఆ ఏముందే, నీళ్ళ కోసం అని వచ్చి ఉంటుంది, ఇది చాల పాత బావి కదా, దాని బరువుకి చుట్టు గోడ విరిగి అది అందులో పడిపోయింది. ఆ పక్కనే ఉన్న ఆమ్మ " ఇది మా మామగారి తండ్రిగారి కాలంలో తీయించిన బావి, రెండు తాటిచెట్ల లోతాయినా ఉంటుంది, గోపాలసామిని ఆ వేణుగోపాలుడే కాపాడాలి" అని మళ్ళీ దండం పెట్టుకుంది. అంతలో వరదాచార్యులవారు వ్చ్చారు. మా ఆమ్మను చూసి ఏం దిగులుపడకండమ్మా గోపాలస్వామి తనను తానే కాపాడుకుంటాడు, నేను కూడా ప్రార్థన చేస్తాను కదా అని, ఆయన కూడా బావి దగ్గరకెళ్ళి నిల్చున్నారు. మా పెద్దనాన్నగారు వంట ఇంటి చపటా మీద నిల్చొని ఉన్నారు. అక్కడ నుంచి అంతా కనబడుతోంది, నేను తమ్ముళ్ళు నెమ్మదిగా అక్కడికి వెళ్ళి నిల్చున్నాము అక్కడ నుంచి చూస్తే, బావి, దాని చుట్టూ ఉన్న మనుష్యులు కనబడుతున్నారు. సాంబడు లోపలనుంచి అరుస్తున్నాడు, ఏమంటున్నాడో స్పష్టంగా వినిపించట్లేదు. బావి గట్టు మీద పెట్రొమాక్స్ లైట్లు పట్టుకొని రొడ్డోడు, చాకలి రామిగాడు, గొల్ల వెంకటేశం, నిల్చొని ఉన్నారు. ఖాసిం, బక్షిమియా, వెంకటరెడ్డి, పేరిరెడ్డి, బావి గిరక దగర నిల్చొని సాంబడు ఏమంటున్నాడో వినటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సాంబడి తమ్ముడు సాలె వీరాసామి అన్నకు సాయంగా లోపలికి దిగటానికి నడుంకి తాడు కట్టుకుంటునాడు. ఇద్దరూ బలమైన వాళ్ళు,అన్నిటికంటే ముఖ్యంగా గజఈతగాళ్ళు.
ఆ పక్కనే ఏసుపంతులు, కంసాలి రామబ్రహ్మం, వరదాచార్యులవారు నిల్చొని ఉన్నారు. ఆయన ఏవో మంత్రాలు చదువుతూన్నారు. బావి లొపలనుంచి ఇప్పుడు సాంబడి తో పాటుగా వీరాసామి గొంతు వినిపిస్తోంది. ఇద్దరూ "ఎహేఎయ్!... నీ... గట్టిగా పట్టుకోండి, నా సామిరంగా! ఇది ఇందులోనే పడాల్నా! ఏం చేస్తున్నార్రా పాలేర్లు ! ఓస్! ఓసోస్! అని ఇద్దరు అన్నతమ్ములు ఆయాస పడ్తున్నారు.ఛట్! కదలమాకు వెలుతురు సరిగా పడనీయ్! అని దానికి రెట్టింపుగా రొడ్డోడ్ని గదమాయిస్తున్నారు గుమాస్తా రామలింగంగారు. వాడేమో లైటు పక్కన పెట్టి ఆత్రంగా బావిలోకి తొంగి చూస్తున్నాడు. "ఆఎద్దు వెల్లికిలాపడి ఉంటుందా, బోర్లా పడిఉంటుందా" అని కంసాలి రామబ్రహ్మం ఏసుపంతుల్ని ప్రశ్నిస్తున్నాడు.
వెల్లికిల్లానేపడి ఉంటుంది అని తనకున్న కొద్ది సైన్స్ పాండిత్యాన్ని ప్రదర్సిస్తున్నారు ఏసుపంతులు. ఇంతలొ తాళ్ళూ! గోనెపట్టాలు దించండి అని బావిలోంచి సాంబడి గొంతు గట్టిగా వినిపించింది.ఆ క్షణంలో నాకు, అక్కడ గాంధీజీ కలలుకన్న నవ భారతసమాజం ఒక మెరుపు లాగ మెరిసింది.అదే ఆమ్మకు కూడా చూపిద్దామని ఆమెను అక్కడకు తీసుకొచ్చాను. ఆమె చూస్తొంది, ఆ పెట్రొమాక్స్లైట్ల వెలుతురులో రొడ్డోడు, చాకలి రామిగాడు, ఖాసిం,పటేల్ బక్షిమియా, వెంకటరెడ్డి, పేరిరెడ్డి,ఏసుపంతులు, కంసాలి రామబ్రహ్మం, గుమాస్తా రామలింగంగారు అందరూ కలిసి పట్టుసడలకుండా తాళ్ళని పట్టుకున్నారు. లోపలనుంచి ఎహేయ్! గట్టిగా పట్టుకొండి అని సాంబడు, వీరాసామి, ఆ పక్కనే మంత్రాలు చదువుతున్న వరదాచార్యులవారు, అందరి ముఖాల్లో ఒకటే ఆతురత గొపాలసామిని ఎలా కాపాడాలి.
అందరికీ తెలుసు అది అమ్మగారికి చాలా ఇష్టమైన ఎద్దు, అదీ కాకుండా అచ్చివచ్చిన ఇంటి కోడెదూడ అని. ఎక్కడా భేధభావంలేదు, బీద గొప్ప తేడా లేదు. ఆ కొద్ది క్షణాలు కులం, మతం తారతమ్యలు విస్మరించారు. చేతులు కలిపి నడుం బిగించి ఏక దీక్షతొ చెమటలు కారుస్తూ తర్జన భర్జన పడుతున్నారు. ఎలా తీయాలి, అది బ్రతికి ఉందో లేదో అని ఆందోళన అందరి మనసుల్లో పీకుతోంది. కాని పైకి మాత్రం ఎవ్వరూ ఏమీ మాట్లాడటలేదు.
గోనెపట్టాలకు తాళ్ళు కట్టి లోపలికి దించారు. లోపల పెనుగులాట వినపడింది. అంతలో అంబా! అన్న అరుపు వినిపించింది. అందరి ముఖాలు ఒక్క క్షణం ఆశ మెరిసింది. సాంబడు ఓస్! ఓస్! అని బుజ్జగిస్తున్నాడు. గోపాలసామికి సాంబడు అలవాటే, అందుకేనేమో అదీ వాడు చెప్పిన మాట వింటోంది.దాన్ని తాళ్ళతో బంధించారు. మూతికి చిక్కం కట్టారు. "ఇక పైకి లాగండి" అని అరిచాడు సాంబడు, కాని వాడికీ, అందరిలాగే ఇది సాధ్యమైన పనేనా అని మనసులో పీకుతున్నది. నెమ్మదిగా! అని అంత కంటే బిగ్గరగా అరుస్తున్నారు రామలింగంగారు.
వరదాచార్యులవారు ఏవో మంత్రించిన నీళ్ళు చల్లడం మొదలుపెట్టారు. మా ఆమ్మ మనసు కొద్దిగా కుదుట పడింది. నెమ్మదిగా తుర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. అవి గుడి గొపురం మీద పడి అంతటా బంగారు కాంతులు విరజిమ్ముతున్నాయి. భధ్రమ్మ అందరికీ కాఫీ కలిపి తీసుకొని వచ్చింది. భధ్రమ్మ, నేను ఆమ్మ చేత కూడా బలవంతాన కొద్ది తాగించాము. బావి దగర పై నుంచి ఎంత మంది పట్టి లాగుతున్నా ఒక్క అంగుళం కూడా కదలడం లేదు. ఏసుపంతులుగారు కలగచేసుకొని ట్రాక్టర్ ఇంజను తీసుకొని వచ్చారు.
తాళ్ళని నెమ్మదిగా ఇంజను వెనక భాగానికి కట్టారు. ఏసుపంతులు గారు "గొపాలస్వామికి జై! అంటూ ట్రాక్టర్ ను ముందుకి నడిపారు. నెమ్మదిగా లేత వెలుతురులో తెల్లటి, పెద్ద ఆకారం ఒకటి తాళ్లతో కట్టబడి బావి అంచుకి వచ్చింది. ట్రాక్టర్ని ఆపమని రామలింగంగారు అనటంతో, ఏసుపంతులుగారు ట్రాక్టర్ని ఆపి మళ్ళీ బావి దగ్గరకు వచ్చారు. ఆ తాళ్ళు ఆ బరువును ఎక్కువ సేపు మోయలేవని తెలుసు.
సాంబడు, వీరాసామి,గోపాలసామిని పకడ్బందీగానే బంధించారు. కాని అది విదిలించుకుంటే ఆ తాళ్ళు ఆపలేవు. ఆసంగతి అందరికీ తెలుసు. కాని అది కుడా అలసి పోయినట్టుగా ఉంది. ఎక్కువగా కదల్లేదు. అందరూ దాన్ని బావి గట్టు మీదకు చేర్చారు. హమ్మయ్య ఒక పెద్ద గండం గడిచింది అని అందరు స్థిమిత పడ్డారు.
పక్క ఊరినుంచి గొడ్లడాక్టరు తెల్లవారేసరికి వచ్చాడు. అప్పటికే ఊళ్ళో ఉన్న జనం నెమ్మదిగా వచ్చి చూసి పోతున్నారు. అందరి నోట్లొ ఒకే మాట. "అమ్మో ఎంత గండం గడిచింది, ఏదైనా అయితే ఈ ఏడాది దేవుడిపెళ్ళి అయ్యేదానా, అమ్మగారిని ఆ గోపాలస్వామే కాపాడాడు". మేము ఇంట్లోకి వచ్చాము. వసారాలో పెద్ద మనుషులందరూ కూర్చొని ఉన్నారు.
బావిలో నీళ్ళు మొత్తం తోడించి పోయాలి అని, నీళ్లు ఇక వాడకానికి పనికి రావు అని ఏసుపంతులుగారు అంటున్నారు. అది కాదండి బావి చాలా లోతయినది అది కుదరని పని, నీళ్ళు టెస్టింగ్ కి పంపి ఆ తరువాత ఆ తాలుకాఫీసు వాళ్ళు ఎలా చెపితే అలా చేద్దాం అని మా పెద్దనాన్నగారు అన్నారు. ఆ పని పటేల్ బక్షిమియాకి అప్పగించారు. వరదాచార్యులవ్వరు "దొరగారూ" అంటూ మాప్ప్పెద్దనాన్నగారి దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో అక్కడ ఉన్న అందరికీ తెలుసు. బావిని శూద్రాదులు, హరిజనులు ముట్టుకున్నారు కనుక దానిని సంప్రోక్షణ చేయవలసిన పని ఉన్నది, లేకపోతే దేవుడి గుడికి కాని ఇంట్లోకికాని, ఆ నీరు పనికి రాదు అని ఆయన ఆందోళన, ఆలోచన.దానికి మా పెద్దనాన్నగారు అమంగారిని అడిగి దానికి కావలసినవి చూడండి కానీ, నీళ్ళ టెస్టింగ్ అయ్యేంతవరకు నీళ్ళు వాడటానికి వీల్లేదు అని అందరికి గట్టిగా చెపపారు.
నాకు మా పెద్దనాన్నగారు తీసుకున్న నిర్ణయం నచ్చింది. లోపలకు వచ్చే సరికి, మా ఆమ్మ, వరదాచార్యులవారితో మాట్లాడుతోంది. ఆయన ఏదొ చెప్తున్నారు, ఆమ్మ శ్రద్ధగా విటోంది. మధ్య మధ్యలో అయ్యో అపచారం కదా, అని చెంపలేసుకుంటోంది. నాకు వాళ్ళ ఇద్దరి సంభాషణ వింటే నవ్వాగలేదు, ఎవరికోసమైతే ఆమె చెంపలేసుకుంటోదో వాళ్ళే లేకపోతే ఈ వేళ గోపాలసామి బ్రతికేదా? ఆ విషయం నేను, వరదాచార్యులవారు వెళ్ళిన తరువాత ఆమ్మ్మతో అన్నాను. "నీదంతా చాదస్తం ఆమ్మా" అనీ దానికి ఆమె "అది కాదే నీవు చెప్పింది నిజమే, కానీ ఊళ్ళో బ్రాహ్మలు, ఊరుకోరు కదా, బావికి సంప్రోక్షణ చెయ్యనిది వాళ్ళు మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఇవన్నీ ఎందుకొచ్చిన గొడవలు, వాళ్ళు చెప్పినట్లు చేస్తే నాకు ఇప్పుడొచ్చిన పెద్ద నష్టం ఏముందీ అని నాకు సర్ది చెప్పి, ఆమె ఇంకాసేపు అక్కడే ఉంటే నేను ఎక్కడ లేని పోని ఉపన్యాసాలు ఇస్తానోనని వెంటనే పని ఉన్నట్లు వెళ్ళిపోయింది. నాకు మాత్రం , మన సమాజంలో ఎప్పుడు మార్పు వస్తుంది? మరి అంతా గాంధేయవాదులే కదా అయినా ఇంకా ఈ తేడాలెందుకు అని అనుకుంటూ నిద్ర ముంచుకొస్తుంటే మళ్ళీ వెళ్ళి పడుకున్నాను.తెల్లవారుఝామున మంగళవాద్యాలు వినపడుతునాయి, అప్పటికే మా ఆమ్మ స్నానం పూజ అయ్యింది. రాత్రికి స్వామి వారి కళ్యాణం. రోజంతా ఏవొ కార్యక్రమాలు ఊళ్ళోవాళ్ళకి అన్న దానం, గోపాలస్వామిని,అమ్మవారిని, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ని చేయడం, ఇంకా ఎన్నో ఉన్నాయి ఆ రోజంతా. మదార్బి "అమ్మాయిగారు స్నానానికి నీళ్ళు తోడాను లేవండి, తలంటుకోవాలి, బేగి రండి," అని పిలిచింది. ఇక ఇప్పుడు తలంటి వద్దని గొడవ చేసినా లాభం లేదని దాని వెనకాలే స్నానాల గదికి వెళ్ళాను. మా ఆమ్మ నాకోసం కుట్టించిన పట్టు పరికిణి జాకెట్టు వేసుకొన్నాను. మదార్బి జడ కుప్పెలు పెట్టి జడ వేసింది. నేను తయారయి వచ్చేసరికి ఆమ్మ వంటింటి గుమ్మంలో పూజా పళ్ళెంతో, గుడికి వెళ్ళటానికి రెడీగా ఉంది.ఎర్క్ర్క పట్టుచీర గోచి పోసి కట్టుకుంది, ముడి వేసుకొని, మెళ్ళో తెల్లరాళ్ళ నెక్లెసు,పెద్దగొలుసుతో అచ్చం లక్ష్మీ దేవిలాగా ఉంది. నన్ను చూసి, ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ ఈవేళ నీ మీదే అని అన్నది. నేను ఆమె ప్రేమకి మనస్సులోనే "ఆమ్మా నా మీదా, నీ మీదా!" అని నవ్వుకున్నాను.నన్ను తేరిపారా చూసి పెరట్లొ ఉన్న గులాబి పూవు కోసుకొని పెట్టుకొమ్మంది. నేను పూవు కోద్దామని వెళ్ళేసరికి రొడ్డోడి చంటిపిల్ల బావి గట్టు మీద నీళ్ళల్లో ఆడుకుంటోంది. చుట్టు చూసాను, ఎవ్వరు కనిపించలేదు, నాకు తెలుసు ఆ సమయంలో జీతగాళ్ళంతా గుళ్ళో ఉన్నారని, దూరంగా రొడ్డోడు పేడకళ్ళెత్తుతూ కనిపించాడు. వాడి భార్య మైసమ్మ ఆవులకి మేత వేస్తోంది. నాకేం తోచలేదు, వెంటనే ఆ పిల్లనెత్తికెళ్ళి కొట్టంలో ఉన్న మైసమ్మ కిచ్చి "పిల్లను బావి దగ్గర వదిలివేస్తావా, నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేదో" అని గట్టిగా చీవాట్లు పెట్టేసరికి అది బెదిరిపోయి "అమ్మాయిగారు నన్ను కేకెయ్యాల్సిందండి, మీరెందుకు ముట్టుకున్నారు దీన్ని, అమ్మో అమ్మగారు చూస్తే కోప్పడతారు, అని ఇంకా ఏదో అంటూనే ఉంది. అంతలొ రొడ్డోడు పరిగెత్తుకొచ్చాడు. "ఏం కాదులే పిల్లను నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకో" అని నేను వంటింటి మెట్లు ఎక్కేసరికి గుమ్మంలో ఆమ్మ నిల్చొని ఉంది. ఆమె ముఖం చూస్తే అంతా చూసి నట్టే ఉంది.నాకు తెలుసు, ఇప్పుడు ఈ బట్టలతో నేను మళ్ళీ తలార స్నానం చెయ్యాలని, నువ్వు వెళ్ళు ఆమ్మా నేను స్నానం చేసి వస్తాను అని అన్నాను. ఆమె నన్ను దగ్గరకు తీసుకొని "నిన్నేం చెప్పావు, దేవుడు మంచి పనులు హర్షిస్తాడన్నావు కదా! నీకేం తప్పులేదు, ఆ గోపాలస్వామి నిన్నందుకే అప్పుడు పెరట్లోకి పంపాడు. "ఈ చాదస్తాలు మా తరంతోనే పోనివ్వు, మీ మీద రుద్దాలని నా ఉద్దేశ్యం కాదు" అని నా ముఖంలోకి చూసింది. ఈ విషయం ఎవరితొ అనవద్దు అన్నట్టుంది ఆమె చూపు.అందరం గుళ్ళోకి వెళ్ళాము. వరదాచార్యులవారు ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. మల్లెపూల గుబాళింపుతో, పట్టుపీతాంబరంతో, నుదుట కస్తూరి తిలకంతో మెళ్ళో బంగారు పతకంతో ఆ వేణుగోపాలస్వామి మెరిసిపోతున్నాడు. నేను ఎంతొ భక్తితో నమస్కరించాను. స్వామీ సమాజంలో మార్పు కోసమేనా ఈ లీలంతా నడిపించావూ! నిన్ను కనుగొనడం ఎవ్వరి తరం ?

Wednesday, March 07, 2007

హిందూత్వము


హిందూత్వము

- VirinchiPriya


మత సామరస్యము, మత సహనము రెండూ మన భారతీయులలో ఎలా జీర్ణించుకొని పోయాయో వెనుకటి మన పల్లెలలో వారు నడిపిన, జీవన విధానాన్ని చూస్తే అర్ధం అవుతుంది. అది వారు ప్రత్యేకంగా పనికట్టుకొని ఇలా ఉండాలి అని అలవర్చుకున్నది కాదు. అది అనాదిగా భారతీయులలొ ప్రకృతి సిధ్ధంగా అలవడినది తప్ప మరొకటి కాదు. ఆ సహజీవనమే వారి నిజ జీవనవిధానము. ఆర్యుల నుంచి ఇటీవల కాలంలో వచ్చిన పాశ్చాత్యుల వరకు ఎంత మంది దండయాత్రలు సాగించినా,తమదైన పంథాలో తమ స్వంత ప్రవౄత్తిని కాపాడుకుంటూ అన్నిటినీ తమలో మమైకంచేసుకున్నారే తప్ప వేటిని వదిలేయలేదు.మనము ఈ సహనాన్ని, సామరస్యాన్ని రెండిటినీ కలిపి భారతీయతత్వము లేదా హిందూత్వము అని చెప్పుకోవచ్చును.

హిందూత్వము యొక్క మౌలిక ప్రకౄతిలోనే మత సహనము ఇమిడియున్నది అనడానికి హిందూమతములో పుట్టి, ముకిత్ సాధనకు మతములు అడ్డు రావని నిరూపించిన ఒక ఇల్లాలే నా ఈ వ్యాసమునకు ప్రేరణ . అది కృష్ణా జిల్లాలో కంభంపాడు అన్న చిన్న గ్రామము. ఆవిడ ఎవరోకాదు మా తాతమ్మగారయిన భండారు రుక్కిణమ్మగారు. సనాతన సత్సంపన్న బ్రాహంఅణ వంశములో పుట్టి , అంతకు తగిన సదాచార్ బ్రాహంఅణ వంశమగు భండారు వారిల్లు మెట్టికూడా ఆమె తన పినతల్లి కుమారుడగు పెద్దపల్లి రాజాగారు నమాజు చేయుట చూచి, ఆ ప్రశాంత జప తపమునకు మురిసిపోయి అతని దగ్గర ఉపదేశము పొందినది.

ఆనాటి నుంచి విధి తప్పకుండా తన 108వ ఏడు, ఆవిడ చనిపోయే వరకు రోజుకు అయిదు సార్లు నమాజు చేసేది. మా అందరికీ ఆశ్చర్యకరమైన ఎప్పటికీ మరచిపోలేని దృశ్యము ఆవిడ చేసే ఈ నమాజు ప్రక్రియ. ఇది ఇక్కడ తప్పక వర్ణించవలసినదే!

ఆ ఊరికి కరణం గారైన వెకటేశ్వర్ రావు గారిల్లు. బయట వసారాలో నుల క మంచము, ఆ మంచము మీద తెల్లటి పక్క. దాని మీద బోసి నోటితో, బోడిగుండుతలతో , నడుము పూర్తిగా వంగిపోయి, తెల్లని గ్లాస్కో చీరతో రవికెలేని ముడతలు పడిన తన శరీరాన్ని పూర్తిగా కప్పుకొని కాళ్ళు వెనక్కి ముడుచుకొని కూర్చొని ఉన్న నూరేళ్ళు నిండిన ఒక పండు ముదుసలే మా తాతమ్మ గారైన రుక్కిణమ్మ గారు. ఆ ఇంట్లో కోడళ్ళ్లు, మనుమరాళ్ళు మడి కట్టుకొని పూజలు పునస్కారలు చేస్తుంటే ఈవిడ తనకంటే మూడింతలూన్న ఒక కఋఋఅ పట్టుకొని, వంగిపోయిన నడుముతో, మసకగా ఉన్న కంటిచూపుతో, మోకాళ్ళెత్తున్న గడపలు దాటుతూ పెరట్లో ఉన్న బావిదగ్గరకెళ్ళి తనంతట తాను నీళ్ళు తోడుకొని స్నానము చేసి, ఒక చిన్న చెంబుతో నీళ్ళు తెచ్చుకొని తన మంచంఉ మీద కూర్చుండేది.ఆవిడ మోకాళ్ళు వెనక్కి ముడుచుకొని వంగి ఏదో లోపల చదువుకుంటూ ముందుకు వంగుతూ లేస్తూఉండేది. ఆ కార్యక్రమము అయిన తరువాత చేతిలో ఉన్న జపమాలతో జపము చేసుకుండేది.

అలా మా తాతమ్మగారైన రుక్కిణమ్మగారు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలతో, 15 మంది మనుమలు మనుమరాండ్రలతో 50 మంది కి పైగా మునిమనుమలతో కష్టాలను సుఖాలను సమంగా పంచుకొని, 1980లో తన నిండు జీవితమును చాలించినారు. ఇలా ఆ ఇంటిలోపల సదాచార బ్రాహంఅణీకం ఇంటి వసారాలో అతి ప్రశాంతముగా, నియమబద్ధముగా మహమ్మదీయ మతాచరణమూ రెండునూ ముక్తిని సాచించుకోగలిగాయి. ఇందులో ఎవ్వరూ ఎవ్వరినీ వెలివేయలేదు. దీని కొరకు ఆ గ్రామములో ఏ వైరాలు లేవలేదు. ఎవ్వరు ఏ రకంగా పూజించినా అన్నీ ఆ భగవంతునికే చేరతాయి, అంతా ఆ ముక్తి కొరకే కదా ! అన్న గొప్ప భావంతో వచ్చిన నిర్లిప్తతే ఒక సహజ స్వభావంగా ఈనాటికి హిందూత్వము పయనము సాగిస్తోంది. ఒక మహానదిహిమాలయ పర్వతశ్రేణులలో ఒక చిన్న ధారగా పుట్టి ఎత్తు పల్లాలకు అనుగుణంగా తన ఉనికిని, తన ఆవేశాన్ని మార్చుకుంటూ చిన్న చిన్న మిగతా ధారలన్నిటినీ కలుపుకొని అంతలోనే అనంత నురగలతో భయంకొలిపే జలపాతంలా మారి అడ్డు వచ్చిన చిన్న, చిన్న రాతి గుండ్రాళ్ళను పిండిచేస్తూ, పెద్ద పెద్ద వౄక్షాలను సైతం వ్రేళ్ళతో సహా పెకిలించి తనతో పాటుగా తీసుకొని ఎత్తైన శిఖరాల మీదనుంచి నేల మీదికి దూకి ప్రవహిస్తూంది. ఈ మహానది యొక్క గమ్యం సాగర సంగమం. అందుకు దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇతర చిన్న కాలువలు నదులు వచ్చినా అన్నిటినీ కలుపుకొని తన గమ్యం చేరటం తప్ప ఈ మహానదికి తరతరాలుగా ఇంకొక మార్గం తెలియదు.

ఇదే విధంగా భారతదేశ హిందూ మతసంస్కౄతి కూడా ఎన్నో వేల సంవత్సరాల పూర్వం, సనాతన వైదిక ధరంఅంగా ఎక్కడ ఎప్పుడు పుట్టిందో కూడా స్పష్టంగా చెప్పలేము. అది ఒక సంస్థగా పుట్టలేదు. దానికి ఎల్లలు ఇవి అని చెప్పగలిగినవారు లేరు. తనది అనంతరూపం, అనేక వైవిధ్య రూపాలాతో తన ఉనికిని చాటుకుంది. హిందూత్వము ఒక మతంగా పుట్టలేదు. పంచభూతాలను పూజిస్తూ మొదలయిన ఈ సనాతన ధరంఅం ఒక తత్వంగా వెలుగొందింది.

ఆ మహానది ఎలా దారిలో వచ్చిన వాటిని తనలోమమైకం చేసుకోకలిగిందో హిందూత్వము కూడా భారతదేశానికి వచ్చిన అనేక మతాలను, ధరంఆలను తనదైన బాణిలో తన స్వస్వరూపాన్ని వదిలిపెట్టకుండా, తన సహజరూపానికి మెరుగులు దిద్దుకుంది.

అసలు హిందూత్వము యొక్క స్వరూపము ఎలాంటిదో తెలుసుకుంటే, మత సహనము మతసామరస్యము ఎలా హిందూత్వములో ఇమిడియున్నాయో అర్ధంవుతుంది. హిందుత్వమున ఛాంధస తత్వమునకు తావులేదు. fundamentalism అనేది హిందూత్వము యొక్క మౌలిక ప్రకౄతి లోనే లేదు. హిందూత్వమునకు ఒక సంస్థ లేకపోవడం అనేది దాని మౌలిక స్వరూపం లో ఒక భాగం. ఎవరూ ఎవరి మీద మతం పేర అధికారం కాని నియమాలను కాని విధించలేదు. హిందూత్వము ఒక తత్వశాస్త్రము. ఇందులో ఆస్తిక నాస్తిక తత్వాలు మేళవించబడ్డాయి. హిందువులు మతం పేరిట కట్టుబడి యుండలేదు. పంచభుతాలను పూజిస్తు మొదలయిన హిందూత్వము తరువాత వచ్చిన దేవతావతారములను తమ మతములో ఆమోదించుట యనునచి చాలా కాకతాళీయముగా ఎవరి ప్రమేయము లేకుండా జరిగింది. ఈ నిర్విరామ అంతులేని అంతర్లీనత, ఇతర మతల పట్ల ఉన్న నిర్లిప్తతే భారతీయులకు మత సహనము అలవరడానికి తోడ్పడింది.

భారతదేశము అనాదిగా ఎన్నో మతములనుకు ఆశ్రయమివ్వడమే, ప్రస్తుత మతసహనమునకు పునాది. హిందూదేశ చరిత్ర చూసినట్లయితే క్రీస్తు పూర్వము 2వ శతాబ్ధములో పుట్టిన వేదాలనుంచి , 6వ శతాబ్ధములో పుట్టిన బౌధ్ధమతము, జైనమతము, 8వ శతాబ్ధములో వచ్చిన యూదులు, క్రీస్తు శకము 4వ శతాబ్ధములో వచ్చిన క్రైస్తవులు. 8వశతబ్ధములో వచ్చిన మహమ్మదీయులు మొన్నీమధ్య వచ్చిన బహాయి మతము , ఇవన్నీ కూడా తమ తమ సస్వరూప్యాన్ని కాపాడుకో కలిగాయి అంటే అది ఒక్క భారతదేశములోనే సాధ్యము.

ఆ మహానది ఎలా తన దారిలోనున్న వాటినన్నిటినీ తన వెంట తీసుకొని ఉర్రూతలూగుచూ సాగరసంగమానికి పయనిస్తుందో హిందూ మతం కూడా తన సనాతన ధర్మాచరణ తో తన చుట్టూ ఉన్న అనేక సంస్కౄతలను, సాంప్రదాయలను, తెగలను, జాతులనే కాక బయట దేశాలనుంచి విచ్చేశిన ఇతర మతాలను సైతం తనవిగా తనలో అంతర్లీనం చేసుకుంటూ మోక్ష సాధనే గమ్యంగా సాగిపోతూ ఉన్నది. హిందూత్వమును ఒక మతం అని పరిగణించడం వల్ల, దాని యొక్క అనంత స్వరూపాన్ని విశ్వమానవ తత్వాన్ని ఒక చట్రం లో బిగించటం అన్న విఫల ప్రయత్నం చేయడమే.

హిందూత్వము యొక్క చరిత్ర పరిశీలించినట్లయితే అనేక ముక్తి మార్గాలు గోచరమవుతాయి. ఆ పరమ పదము సాధించడానికి, ఆ బ్రహ్మజ్ఞానమును పొందడానికి పూర్వము అనేకమంది అనేక మార్గాలు అవలంబిచారని తెలుస్తుంది. భగవంతునిని కనుగొనడానికి , సత్య అన్ వేషణకు ఏ మార్గం అయినా తప్పు లేదు అనే భావనే మన భారత దేశ మత సహనానికి పునాది అని ఈ చరిత్ర వక్కాణించి చెప్తుంది.
హిందూత్వములో నున్న ఆలోచనాస్వేఛ్చ, మనుష్యులకు వారి వారి సమర్ధతను, వారి ఇష్టం ను పట్టి విభిన్న రీతులలఓ ఆ భగవంతునిని ఫూజించటానికి అవకాశం కల్పించింది.హిందూత్వము యొక్క అనంతమయమైన లక్షణాలలో ఇష్టదేవతా ప్రార్థన ఒక రూపం. యుగా ల నుంచి హిందూత్వములో అంతర్లీనమయిన వివిధ దేవతా స్వరూపాల నుంచి ఎవరి మనసుకు నచ్చిన , ఎవరికి అనుకూలమయిన దేవతాలను పూజించడం అనేది క్రమక్రమముగా ఆచారంగా మారింది. కులదైవాలు అనేది బహుశా ఇలాగనే మొదలు అయిఉండవచ్చును. ఈ ఆచరణ హిందూమత గ్రంథాలగు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులలో ప్రస్తావించిన దేవతలతోనే ఆగలేదు. ఆ తరువాత వచ్చిన ఎంతొమంది యోగులను, మహాపురుషులను కూడా పూజించడం అనేది పరిపాటి అయిపోయినది. ఈ యొక్క ఇష్టదేవతా ప్రార్థన అనే సాంప్రదయము ఇతర మత దైవాలను, యోగులను, పూజించడాన్ని కూడా ఎవరూ ఖండించలేదు. ముక్తి సాధన కొరకు పాటు పడిన అందరినీ హిందూత్వము తనలో మమైకము చేసుకుంది.

అలాంటి ముక్తిమార్గాలలో, ఈ యొక్క ఇష్ట దైవాన్ని ఎన్నుకొనుటలో మహమ్మదీయ దైవమయిన 'అల్లా ' ని పూజిం ంచడం , మహమ్మదీయ దైవప్రార్థన అయిన 'నమాజూ చేయడం సహితం అలవాటు చేసుకున్న ఒక సద్ బ్రాహ్మణ ఇల్లాలి గురించి చెప్పడమే ఈ సుధీర్ఘ ఉపన్యాసము యొక్క ముఖ్యోద్దేశ్యము.

Friday, February 09, 2007

Lot's happening in India!

"Life moves pretty fast. If you don't stop and look around once in a while, you could miss it." -Ferris Bueller

In almost every edition of Business Week you will find at least one article on India. It's common to hear India named where ever the hot topics like global warming, and job outsourcing are passionately discussed, be it radio or television.

I came across a few news makers, in case you missed them...

The annual Bangalore air-show attracted many big shots this time around. In a PR stunt, Ratan Tata flew in a F-16, a fighter jet. I don't know if indigenously made airplanes also participated in this show. Just after writing this line, I found an article that mentioned about an aircraft developed in India that crashed during the show. I hope no one got hurt and that this is only a temporary setback. The picture below is of a Light Combat Aircraft built in India.
Join the BBC debate: India - regional bully or friend
"The radio broadcast will be on 11 February. It will be televised on 17 and 18 February. You can participate by sending in your questions or views for the panellists by 8 of February".

Recent BBC Poll findings: "The poll found that a majority (71%) are proud to be an Indian"
BBC Article: Globalisation Shakes the World

Coincidentally, as I was writing this entry, my brother emailed me about how India is being dubbed as the next super power and how India is far from becoming that. In his own words - "I am quite happy as everyone else to see the progress India's been making over the last decade, but it's important to realize that there's a loooong way to go and not get too cocky... So, here's an article from this perspective: India the Superpower? Think again ...Raahy"

I agree with that notion. I would say that India is catching-up with industrialized western nations in many aspects. However, India has to take advantage of its recently gained wealth and invest in itself. I would argue that India is doing that, but it takes time to have any significant impact on larger public simply because of its huge population.

As an example there was a report on NPR about a reporter bombarded by surveys (NPR Audio - In India, It's Survey Mania) where ever he went. He was complaining about a survey he got many times while traveling in train to somewhere in India. Some students gave him a survey to fill out about 'how the toilets were' as toilets in that train were modernized and they would like to get some feedback. He might have gotten annoyed, but I see it as a sign that India is investing in itself - however slowly that might be.

Tuesday, January 02, 2007

Unsolved Mystery!

Paul Brubaker reporter of Herald News writes this way:

Will authorities solve the mystery of who murdered Geetha Angara?

It's been nearly two years since Passaic Valley Water Commission chemist Geetha Angara was found dead in an underground water storage tank. Meanwhile, investigators at the Passaic County Prosecutor's Office have not determined a motive for her murder and are still in pursuit of her killer. Angara was married, the mother of three children, and had a promising career at the PVWC.


I cannot fathom how co-workers of Geetha Angara are still able to work at the same place, with a very likely possibility that a murderer is could be among them. It amazes me to see how little media coverage this case got. I have no doubt, if the victim were to be white; the case would have been solved long time ago.

Our thoughts and prayers are with her husband Jaya Kumar and her three children who are left behind.