Friday, July 06, 2007

కొన్ని తవికలు

రెమినిసింగ్ (Reminiscing)
జ్ఞాపకమనే మూడో నేత్రంతో
గతమనే గనిని వెతికి చూస్తే
చివరకు దొరికింది తీయని అసంతృప్తి

ఇన్సామ్నియాక్ (Insomniac)
నిద్రాదేవి అందని తావి
తప్పిన గురి - నా జీవన ఝురి

ద్వంద్వం 2
ఇవి ఆలోచనలు
వీటికి హద్దులే లేవు
నిరంతరం ఆకాశమార్గానే వీటి పయనం
ఆశయాలు, ఆశ్లేషాలు, ఆవేశాలు
వీటిని విహరింపచేసే రెక్కల గుర్రాలు
అవి చేసే పనులు
వాటికి ఉన్నవే హద్దులు
యదార్ధపు ఊబిలో వాటి నివాసం
సందిగ్ధాలు, సందేహాలు, సంక్లిష్టాలు
వాటిని పీడించే దోమలు, జలగలు, మొసళ్ళు..

మా పాపాయి

మా పాపాయి

ముద్దులొలికే పాప మురిపాల పాప
మా పాప సాటి మహిలోన లేదు!!

తాతయ్య చేతినొకచేత పట్టి
నానమ్మ కోకనొకవేలు చుట్టి!
అడుగులో అడుగు వేసుకొని నడిచి
అందమైన లోకాల చుట్టిచుట్టి...
|| ముద్దులొలికే పాప ||
ఆటలకే కాని, పాటలేకాని
ఆర్ష విద్యలందైన కాని అన్నింట ముందుండ
అమ్మ సీతమ్మ ఆశీస్సులే నీకుండ
అరుదైన బిరుదులన్నీ మా పాపాయి సొత్తు
|| ముద్దులొలికే పాప ||
మాధుర్యమైన మాటలే పలుకుచుండు
మంచి చెడులనుయందు హంసిగానుండు
ఎంత ఎదిగినకాని ఒద్దికగ ఒదిగుండు పాప
|| ముద్దులొలికే పాప ||
అమ్మ పొత్తిళ్ళలో కేరింత
అజితాన్వితకిదె జయము! జయము!!
ఆటపాటల అజేయపరాక్రమానమందాన్వితకిదే జయము! జయము!!
|| ముద్దులొలికే పాప ||

చి|| అన్వితకు బారసాల సందర్భంగా,
బామ్మ - తాతయ్య
పిన్ని - బాబాయి
అమ్మ - నాన్న

Written by Prasad Komarraju