Sunday, April 08, 2007

సుప్రభాత సేవ

శ్రీ కృష్ణపరభ్రహ్మణే నమ:
సుప్రభాత సేవ

ఫ్రసాద్ కొమ్మర్రాజు


1.
కౌసల్యా సుత దాశరధిరామా
కౌస్తుభాభరణ జానకిరమణా
కొండల కోనల తూరుపు దిక్కున
సూర్యోదయ సమయంబాయె!!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

2.
నీవెలుగున వెలిగే సూర్యచంద్రులు
నీబలమున వేచే వాయుదెవులు
నీకనుసైగలతిరిగే దిక్పాలకలు
నీఅనుమతికైవేచిన వేలుపులు

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

3.
క్షీరాబ్ధియందు పవళించి విహరించు శ్రీహరి!
క్షిరసాగర తరంగ చిణ్కులు రవలించువెళ
క్షిరాబ్ధి కన్యకను కూడి క్రీడించు వేడ్క ముగిసె
క్రిరసాగర తరించె లెమ్ము! మమ్ము పాలించువేగ!!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

4.
శ్రీచక్రపురమున శయనించు చిన్మయమూర్తి!
శ్రీదెవీపరిష్వంగానంద డొలికనుండీ
శ్రీనివాసా! మెల్లమెల్లగా నీకలువకన్నులు
పద్మదళప్రపుల్లమై ప్రత్యూష దర్శన మీయవా!!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!


5.
వెలుగు చిందెటి సూర్యకిరణాలు దిక్కులు
వెల్లి విరయ కమంబులువిరిసెనయా!
విహంగములు నింగికినెగిరి కీర్తించెనయా
విష్నుభక్తులు వాకిటజేరి భజనలు చెసిరయా!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

6.

శుకములు పికములు
చక చక పలికే వేదములు
ఝుం ఝుం అంటూ తుమ్మెదగుంపులు
చెసే తుంబురు నాదంబులు!!

జలజల పారే నదీనదములు
నీరద నారద సంగీతములు
మలయ మారుతములు విసిరే వింజామరులే!
సప్తగిరుల తరులు విరిసి వెలసిన రంగవల్లులే !!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

7.
రంభా ఊర్వసి దివిజేంద్రుని
నాట్యభమలూ భువిలో మయుర నాగిని
నాట్యముచెయగ వేంచేశారే వేంకటాద్రిని

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

8.
సరసిజనాభుని పదముల జేరగ
సరసున విరిసిన కమలములు
సుందర వనమున మన్మధ కరమున పెరిగిన
సుమనోహర మల్లెలు జాజులు
స్వామీ! నీకంటహరమున చేరగ కోరుచున్నవే!!

వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!

స్వామీ! సుప్రభాత సమయం సమయంబిదియే!

9.
అందుతున్నదేదొ జన్మలపున్యం
అద్దుతున్నదేదోమరేదోజన్మల పాపం
అది యిది యేమొకానీ నీ దర్సనభాగ్యమె
అమితానందం అవనిలోనమాకు!
వెంకటరమణా! సంకటహరణా!
నిదుర లెచే సమయంబిదియే!!స్వామీ! సుప్రభాతసమయం సమయంబిదియే!